బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జి జాతికి అంకితం చేసిన భారత ప్రధాని...జి.రమేష్,కర్నూలు బిజినెస్ ఏరియా పిజిఎం...
బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జి జాతికి అంకితం చేసిన భారత ప్రధానిజి.రమేష్,కర్నూలు బిజినెస్ ఏరియా పిజిఎం
భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అ భివృద్ధి చేసిన బిఎస్ఎన్ఎల్ 4జి సేవలను భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడి శాలోని జార్సుగూడ నుండి ప్రారంభించారని కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనర ల్ మేనేజర్ జి.రమేష్ తెలిపారు.శనివారం కర్నూలు జిల్లా,పత్తికొండ మండలం,పులికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన 4జి టవర్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్ హాజరై మాట్లాడుతూ జాతీయ సమాచార మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా రూ.37,500 కోట్లతో స్వదేశీ పరిజ్ఞానంతో ( మేక్ ఇన్ ఇండియా) దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసిన 97,500 టవ ర్లను,దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 108గ్రామాల్లో 4జి సేవలను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తూ జాతికి అంకితం చేశారని అన్నారు.ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10గ్రామాల్లో కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం,పులికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన 4జి శాచురేషన్ మొబైల్ టవర్ ను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించారని తెలిపా రు.ఈ స్వదేశీ 4జి నెట్వర్క్ ను సాఫ్ట్ వేర్ అప్డేట్ తో త్వరలో 5జీ గా ఆధునీకరించుకోవ చ్చు అని తెలిపారు.కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 376టవర్లు 4జిగా మార్చడం జరి గిందని,అదనంగా 100కుపైగా 4జి టవర్లు స్యాచురేషన్,యాడ్ ఆన్ ప్రాజెక్టు కింద రాబో తున్నాయని పేర్కొన్నారు.బిఎస్ఎన్ఎల్ 4జి ద్వారా డిజిటల్ చెల్లింపులు,డిజిటల్ లెర్నిం గ్,స్మార్టర్ వ్యవసాయము,టెలి మెడిసిన్ వంటి కార్యక్రమాలను సులువుగా చేసుకోవచ్చని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్,తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్,ఎంపీడీఓ కవిత,ఎలక్ట్రికల్ ఏడిఈ రామకృష్ణ,పులికొండ సర్పంచ్ ఎం.అనసూ యమ్మ,బిఎస్ఎన్ఎల్ డిఇ రూరల్ నారాయణ స్వామి,ఏజీఎం సేల్స్ అండ్ మార్కెటింగ్ దే వచంద్ నాయక్,పత్తికొండ జెటిఓ తిరుమలేష్,అదేవిదంగా కర్నూలు టెలిఫోన్ ఎక్స్చేం జిలో ఏర్పాటుచేసిన లైవ్ కార్యక్రమంలో ప్రస్తుత డీజీఎం సాయినాథ్,డిఈలు,సంస్థ ఉ ద్యోగులు,ఫ్రాంచైజీలు,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment