అక్టోబర్,7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి...ఫ్యాప్టో...
అక్టోబర్,7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి...ఫ్యాప్టో
రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా అ క్టోబర్,7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వ హిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు కాకి ప్రకాష్ రా వు కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.రాష్ట్ర ఫ్యాప్టో పిలుపుమేరకు వి జయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయుటకు సన్నాహక సమావేశం క ర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఆర్ సేవాలాల్ నాయక్ అధ్యక్షతన ఎస్టియు భవన్ లో సో మవారం జరిగింది.సమావేశానికి ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్,కర్నూలు జిల్లా పరిశీలకులు కాకి ప్రకాష్ రావు హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించడం,అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పిఆర్సి,మధ్యంతర భృతి మంజూరు ,సి.పి.ఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం,ఆర్థిక బకాయిల చెల్లింపు,పెన్షనర్లకు కా ర్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒ క్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని అన్నారు.ఉద్యోగులకు స్నేహ పూరిత ప్రభు త్వం అని చెబుతూనే రాష్ట్రంలోని 12 లక్షల ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబం ధించిన ఏ ఒక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించిన పరిస్థితి కానీ,చర్చించిన పరి స్థితి కానీ లేదన్నారు.ప్రభుత్వ పథకాలను,నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం,సంక్షేమం మాత్రం ప్రభుత్వం మరిచి పోయిందన్నారు.ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించవలసిన దాదాపు రూ.30వేల కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినప్పటికీ ఇం తవరకు స్పందన లేదన్నారు.సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ విధానం అమలు చే స్తామని హామీ ఇచ్చి,అధికారంలోకి వచ్చాక ఇంతవరకు చర్చించిన పరిస్థితి లేదన్నారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుకు సంబంధించిన దస్త్రం ఆర్థిక శా ఖలో గత నాలుగు సంవత్సరాలుగా మూలుగుతుందన్నారు.పదవీ విరమణ చేసిన ఉద్యో గులకు చెల్లించవలసిన గ్రాట్యూటీ,కమ్యూటేషన్,ఈ.ఎల్ ఎన్కాష్మెంట్,అంత్యక్రియల ఖ ర్చులు తదితర పెన్షన్ సౌలభ్యాలను కూడా చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అ ద్దం పడుతుందన్నారు.ఉపాధ్యాయు లను బోధనకే పరిమితం చేయాలన్న డిమాండ్ చే యవలసిన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకొని తగుచర్యలు తీసుకోవాలని కోరారు.ఉ ద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ప్రతి సంవత్సరం రూ.180 కోట్లు హెల్త్ కార్డుల అమలు కొ రకు చెల్లిస్తున్నప్పటికీ హెల్త్ కార్డుపై వైద్యానికి ఏ హాస్పిటల్లో అంగీకరించడం లేదన్నారు. ప్లస్ టు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లే దన్నారు.వెంటనే ప్లస్ టూ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.అ లాగే పురపాలక ఉపాధ్యాయులకు జిపిఎఫ్ సౌకర్యము,అర్బన్ ఎంఈఓ పోస్టులను మం జూరు చేయాలని కోరారు.గురుకుల, ఆదర్శ,1998,2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల పద వీ విరమణ వయస్సు 62సంవత్సరాలకు పెంచాలన్నారు.కేజీబీవీ ఉపాధ్యాయులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస వేతన స్కేల్ కూడా అమలు చేయడం లేదన్నారు. ప్రభు త్వ ఉత్తర్వుల మేరకు వెంటనే ఎంటీఎస్ ను అమలు చేయాలని కోరారు.ఫ్యాప్టో జిల్లా చై ర్మన్ సేవా లాల్ నాయక్ మాట్లాడుతూ కారుణ్య నియామకాలలో జాప్యం వలన మరణిం చిన ఉద్యోగుల వారసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.అంతర్ జిల్లా బది లీలలో స్పౌజ్ క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ బదిలీ అవకాశం కల్పిం చాలని కోరారు.ఏకీకృత సర్వీస్ రూల్స్,జేఎల్ పదోన్నతుల సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకపోవడంతో మూడు దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో విద్యా రంగ,ఆర్థిక సమస్యలపై చ ర్చించి పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.సెక్రటరీ జనరల్ భాస్కర్ మాట్లాడుతూ గతంలో కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇచ్చిన లేఖపై స్పందించిన కడప ఆర్ జెడి శామ్యూల్ కి ధన్యవాదాలు తెలిపారు.అలాగే కర్నూలు జిల్లా విద్యాధికారి జిల్లా లోని విద్యా శాఖ సమస్యలపై ఫ్యాప్టో సభ్య సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని,అదే విషయంను నేడు లేఖ ద్వారా జిల్లా విద్యాధికారికి ప్రాతినిధ్యం చేయడం జరిగిందని చెప్పారు.కార్యవర్గ సభ్యులు రవి కుమార్ (యుటిఎఫ్), నవీన్ పాటిల్ (యుటి ఎఫ్),గోకారి (ఎస్ టి యు),జనార్ధన్ (ఎస్ టియు),రంగన్న (ఎపిటిఎఫ్ 257), ఇస్మా యిల్ (ఎపిటి ఎఫ్ 1938),మరియానందం(ఎపిటిఎఫ్ 1938),మధుసూదన్ రెడ్డి (ఆప్టా) హుస్సేన్(ప్రధానోపాధ్యాయ సంఘం),రోషన్న (డిటిఎఫ్),నందీశ్వరుడు (బిటిఎ) శేఖర్ (పిఈటి అసోసియేషన్),వెంకటేశ్ (ఎస్ టిటిఎఫ్) తదితరులు అక్టోబరు,7వ తేదీన విజ యవాడలో జరిగే ఫ్యాప్టో ధర్నా కార్యక్రమానికి హాజరై కర్నూలు జిల్లా నుండి పెద్ద ఎత్తున కదలి వెళ్ళాలని సంయుక్తంగా కర్నూలు జిల్లా ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
Comments
Post a Comment