దసరాకు బలవంతంగా వసూళ్లకు పాల్పడిన ట్రాన్స్ జెండర్ లు...ఏడుగురిపై కేసు నమోదు...
దసరాకు బలవంతంగా వసూళ్లకు పాల్పడిన ట్రాన్స్ జెండర్ లుఏడుగురిపై కేసు నమోదు
గద్వాల జిల్లా,అయిజలో బుక్ సెంటర్ నడుపుకునే అమ్రేష్ వద్ద బలవంతంగా డబ్బులు వ సూలు చేయడానికి యత్నించిన ఏడుగురు ట్రాన్స్ జెండర్లపై కేసు నమోదైంది.బాధితుడు వివరాల ప్రకారం...ట్రాన్స్ జెండర్లు దసరా మామూళ్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేశారు. వారికి రూ.20 ఇవ్వగా తీసుకోకుండా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాడికి పా ల్పడ్డారు.దీంతో బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,కేసు నమో దు చేశారు.ఎస్సై మాట్లాడుతూ రోడ్లపై తిరిగే వాహనాలు,ప్రజలను బలవంతంగా వసూ లు చేసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని హెచ్చరిం చారు.
Comments
Post a Comment