లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు...
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు
విశాఖలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ACBకి చిక్కారు.రవితేజ అనే వ్యక్తి తన ఇంటికి సంబందించి సర్వే నంబర్ తప్పుగా ఉందని...సర్వే చేసి సరైన రిపోర్టు ఇ వ్వాలని ములగడ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికెట్ కు రూ.30 వేలు లంచం ఇవ్వాలని సర్వేయర్ సత్య నారాయణ,జూనియర్ అసిస్టెంట్ నగేశ్ డిమాండ్ చేయడంతో రవితేజ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.మహాత్ కాలనీ సచివాలయం వద్ద లంచం తీసుకుంటుండగా వీరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Comments
Post a Comment