ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి అనిత క్లాస్...
ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి అనిత క్లాస్
విజయనగరం జిల్లా,చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చే స్తున్న మైనర్లను హోంమంత్రి వంగలపూడి అనిత గమనించారు.తన కాన్వాయ్‌ను అక్కడే ఆపించి,మైనర్లను సుతిమెత్తగా మందలించారు.వాహనాలను చట్ట విరుద్ధంగా మైనర్లకు ఇవ్వడం నేరమని గుర్తు చేసిన హోం మంత్రి,ఈ ఘటనను తల్లిదండ్రులకు తెలియజేయా లంటూ పోలీసులు ఆదేశించారు.ఈ సందర్భంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ వాహ నాలను నడిపే వయస్సు రాకముందే పిల్లలకు స్కూటీలు,బైకులు ఇవ్వడం వల్ల వారు త మ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారన్నారు.ఇది కేవలం వ్యక్తిగత సమస్య కా దు,సమాజంలోని రహదారి భద్రతకు ముప్పుగా మారుతుందని వ్యాఖ్యానించారు.తల్లి దండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో చట్ట నిబంధనలు,ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆమె సూచించారు.
Comments
Post a Comment