పేదలపై హిందూజా ఫైనాన్స్ కంపెనీ దౌర్జన్యం అరికట్టాలి...తప్పుడు సర్వేనెంబర్ లతో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి...జి.రామకృష్ణ,సిపిఎం పార్టీ జిల్లా కార్యధర్శి వర్గ సభ్యులు...కె.సుధాకరప్ప,నగర కార్యదర్శి వర్గ సభ్యులు...
పేదలపై హిందూజా ఫైనాన్స్ కంపెనీ దౌర్జన్యం అరికట్టాలితప్పుడు సర్వేనెంబర్ లతో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలిజి.రామకృష్ణ,సిపిఎం పార్టీ జిల్లా కార్యధర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,నగర కార్యదర్శి వర్గ సభ్యులు
కర్నూలులో పేదలకు రుణాలు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న హిందూజా ఫైనాన్స్ కం పెనీ దౌర్జన్యం అరికట్టాలని,అదేవిదంగా పట్టా భూములను తప్పుడు సర్వేనెంబర్ లు సృ ష్టించి రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకువాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యధర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ,నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాక రప్పలు డిమాండ్ చేశారు.ఈ మేరకు కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్,ము జఫర్ నగర్ లో పేద కుటుంబమైన జాకీర్ హుస్సేన్ ఇంటికి హిందూజా ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది తాళం వేసి బెదిరింపు లకు పాల్పడుతున్న ఘటనకు శనివారం సిపిఎం పార్టీ ఆ ధ్వర్యంలో జాకీర్ హుస్సేన్ ద్వారా సమాచారం సేకరించారు.ఈ సందర్బంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యధర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ,నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాక రప్పలు మాట్లాడుతూ 2021వ సంవత్సరంలో ముజఫర్ నగర్ లోని జాకీర్ హుస్సేన్, వారి కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇల్లు (ఇంటి నెంబర్ - 77/1115) ప్రభుత్వం వీరి ని పేద కుటుంబంగా గుర్తించి 1990వ సంవత్సరంలో ఇచ్చింది.వారి గృహం సర్వే నం బర్ 532కు చెందినది.పక్కా ప్రభుత్వ భూమి అన్నారు.ఇలాంటి ఇళ్లకు హిందూజా కం పెనీ వారు కొంతమంది ఏజెంట్లను పెట్టి పేదలకు ఎరవేసి రుణాలు ఇస్తూ వడ్డీల రూపం లో జలగల్లాగా పీక్క తినడానికి వేసిన ఎత్తుగడలో జాకీర్ హుస్సేన్ కుటుంబం ఒకటి అ న్నారు.ఆ కుటుంబానికి ఇచ్చిన మొత్తం ఋణం రూ.3.90 లక్షలు,ఏజెంట్ కమిషన్ రూ. 1.00లక్షలు,ఇన్సూరెన్స్ రూ.60వేలు,కంపెనీ ఫీజు రూ.20వేలు ప్రకారంగా మొత్తం రూ.5.70లక్షలు ఋణం ఇచ్చినట్లు తెలిసింది.కాని ప్రస్తుతం రూ.8.00లక్షలు చెల్లించాల ని హిందూజా ఫైనాన్స్ కంపెనీ దౌర్జ్యన్యానికి పాల్పడడం దుర్మార్గం.ఇది అత్యంత మోస పూరిత చర్యగా వారు ఖండించారు.అందులో ఇప్పటికే జాకీర్ హుస్సేన్ రూ.3.30 లక్ష లు రుణం చెల్లించాడు. మిగిలిన ఋణం తక్షణమే చెల్లించాలని,లేకపోతే ఇంటిని వేలం వేస్తామని లాయర్ లు,పోలీసులను వెంట బెట్టుకుని జాకీర్ హుసేన్ ఇంటికి వెళ్లి బెదిరిం పులకు దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు.జాకీర్ హుసేన్ తీసుకున్న రుణంలో మొత్తం డబ్బులు చెల్లించినప్పటికి ఇంకా డబ్బులు కట్టాలని బెదిరించడం ఎంతవరకు స మంజసం అని ప్రశ్నించారు.అలాగే జాకీర్ హుసేన్ ఇళ్ళు రిజిస్టర్ కావడానికి అవకాశం లేదు.ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కొనడం,అమ్మడం చెల్లదు. అయినా కూడా హిందూజ ఫైనా న్స్ కంపెనీ వారు సర్వే నెంబరు 532ను,సర్వే నంబర్ 534గా తప్పడు సర్వే నంబర్ తో రిజిస్టర్ చేశారు.కనీస విచారణ లేకుండా ప్రభుత్వ భూములను మామూళ్ళ మత్తులో రిజి స్ట్రేషన్ చేసే అధికారుల తీరు సరైంది కాదన్నారు.ఈ విధంగా పేదల ఇళ్లను కబ్జా చేయడం కోసం కుట్రలు చేస్తూ హిందూజా ఫైనాన్స్ కంపెనీ ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాకీర్ హుసేన్ కుటుంబ సభ్యులు హిందుజా ఫైనాన్స్ కంపెనీ వారిని అభ్యర్థించిన కూడా పట్టించుకోకుండా సోమవారం వస్తే జాకీర్ హుసేన్ కుటంబం లక్ష రూపాయలు అదనం గా చెల్లించాలని,లేకపోతే తప్పనిసరిగా ఇంటిలోని సామాను బయట వేసి,వేలం వేస్తామ ని బెదిరించడంతో జాకీర్ హుసేన్ కుటుంబం ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు.ఈ నే పథ్యంలో హిందూజా ఫైనాన్స్ కంపెనీ దుర్మార్గం స్పష్టంగా కనబడుతుందని అన్నారు.స దరు కంపెనీపై సమగ్ర విచారణ జరిపి,వారు రిజిస్టర్ చేసుకున్న ఇల్లు ఎక్కడుంది.ప్రస్తుతం ఉన్న ఇంటికి తాళం వేసి, బెదిరించే ఇల్లు ఎక్కడ ఉంది.ఏ సర్వే నెంబర్లు ఉందో తెలుపా లని డిమాండ్ చేశారు.పేదలపైన ఈ రకమైన దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.పోలీసు ఉన్నతాధి కారులు వెంటనే జోక్యం చేసుకొని,సదరు హిందూజా ఫైనాన్స్ కంపెనీ దౌర్జన్యాలను కట్టడి చేయాలనీ విజ్ఞప్తి చే శారు.ఇప్పటికే హిందూజా కంపెనీ వారి వేధింపుల వల్ల జాకీర్ హుస్సేన్ భార్య అయిన సే కున్ భి ఇటీవల మృతి చెందింది.జాకీర్ హుస్సేన్ కు ముగ్గురు ఆడపిల్లలు.వారి సమస్యల తో సతమవుత మవుతున్న పరిస్థితి ఉందన్నారు.ఈ పరిస్థితులలో గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లు హిందూజా కంపెనీ లక్షల రూపాయల్లో చెల్లించాలని బెదిరింపులకు పా ల్పడడం మానుకోవాలన్నారు.లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జాకీర్ హుసేన్ కుటుం బానికి న్యాయం జరిగేవరకు పోరాటం సాగిస్తామని వారు తెలిపారు.
Comments
Post a Comment