ఎసిబికి చిక్కిన రహదారులు భవనాలు శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్...
ఎసిబికి చిక్కిన రహదారులు భవనాలు శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్
నంద్యాల జిల్లా,ఆళ్లగడ్డ రహదారులు భవనాలు శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరి సోమవారం జిల్లా అవినీతి నిరోధక శాఖ (ACB) అ ధికారులు లంచం తీసుకుంటుండగా వల పని పట్టుకున్నారు.ఎసిబి డీఎస్పీ సోమన్న మీడి యాతో మాట్లాడుతూ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ పని కోసం కాంట్రాక్టర్ నుండి ఏఈ దస్తగిరి రూ.55వేలు లంచం డిమాండ్ చేశారు అని తెలిపారు.బాధితుడు రమేష్ మొదట రూ.40 వేలు నగదు ఇచ్చాడు.మిగిలిన రూ.15వేలు కోసం ఏఈ మరల డిమాండ్ చేయగా బాధి తుడు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దస్తగిరిని రెడ్ హ్యాండె డ్‌గా గుర్తించి,లంచం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాడి చేసి కేసు నమోదు చే శారని డీఎస్పీ సోమన్న తెలిపారు.
Comments
Post a Comment