ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం...చనిపోయే వరకు జైలు శిక్ష...కోర్టు సంచలన తీర్పు...
ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యంచనిపోయేవరకూ జైలు శిక్షకోర్టు సంచలన తీర్పు
VS9TV న్యూస్,విశాఖ :
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే ఐదేళ్ల కుమార్తె పట్ల మృగంలా ప్రవర్తించాడు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఆ కసాయికి విశాఖపట్నం పోక్సో కోర్టు అత్యంత క ఠినమైన శిక్ష విధించింది.నిందితుడు మరణించేంత వరకు జైలులోనే ఉండాలని సంచల న తీర్పు వెలువరించింది.ఇలాంటి శిక్ష విధించడం చాలా అరుదని న్యాయ నిపుణులు పే ర్కొంటున్నారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...విజయనగరం జిల్లా,పూసపా టిరేగ మండలానికి చెందిన 27ఏళ్ల వ్యక్తి తన భార్య,ఐదేళ్ల కుమార్తె,ఏడేళ్ల కుమారుడితో కలిసి విశాఖలోని జాలారిపేటలో నివసిస్తున్నాడు.ఈ ఏడాది ఏప్రిల్,15న భార్యతో గొడ వపడి ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.అదేరోజు రాత్రి మద్యం మత్తులో తగరపువలసలోని పాత సినిమాహాలు వద్ద ఓ దుకాణం ముందున్న రేకు ల షెడ్డులో పిల్లలను నిద్రపుచ్చాడు.అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న తన ఐదేళ్ల కుమార్తెపై పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టాడు.చిన్నారి ఏడుపులు విని అక్కడే ఆగి ఉన్న లారీ డ్రైవర్,క్లీనర్ గమనించారు.వారు వెంటనే సమీపంలోని సెక్యూరిటీ గార్డుకు చెప్పగా,ఆయ న పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసు లు,అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించి నేరాన్ని నిర్ధారించారు.తీవ్ర రక్తస్రావంతో ఉన్న చి న్నారిని వెంటనే చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.అనంతరం కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.అప్పటి ఏసీపీ పెంటారావు ఈ కేసు దర్యాప్తును చేపట్టి, పక్కా ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు.సీసీ ఫుటేజీ,వైద్యుల నివేదికలు,ఇతర సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం...నిందితుడిని దోషిగా తేల్చి మర ణించేంత వరకు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.బాధితురాలికి ప్రభుత్వం తరపున ఐదు లక్షల పరిహారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది.
Comments
Post a Comment