బాలకృష్ణకు చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్... బహిరంగ లేఖ ద్వారా వివరాలు...

బాలకృష్ణకు చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్
బహిరంగ లేఖ ద్వారా వివరాలు

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ తో జరిగిన సినీ పెద్దల సమావేశంపై అసెం బ్లీలో జరిగిన చర్చపై చిరంజీవి స్పందించారు.విదేశాల్లో ఉన్నందున లేఖ విడుదల చేశా రు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గత గురువారం శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై గౌరవ శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది.అసెంబ్లీ వేదికగా శాసన సభ్యులు బాల కృష్ణ మాట్లాడుతూ “కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈ యన వచ్చాడు అన్నది అబద్ధం అన్నారు.గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ” అంటూ ” ఆ యనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట.లేకపోతే సినీమాటోగ్రఫీ మినిస్టరును కలవడన్నాడట”,అంటూ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్ లో ప్రత్యక్ష ప్ర సారం ద్వారా చూసినట్లు పేర్కొన్నారు.ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది.కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను.రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు,ఫిలిం ఛాంబర్ ప్ర తినిధులు తమ వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధ రల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని కోరడం జరిగింది అని అన్నారు.అందులో భాగంగా చొరవ తీసుకోవాలని కోరారు.అప్పుడు తనను కలిసిన వారిలో రాజమౌళి,కొరటాల శివ,త్రివిక్రమ్ శ్రీనివాస్,మహేష్,ఎన్టీ రామారావు,డివివి దా నయ్య,మైత్రి మూవీస్ వారు,ఇంకా ఇద్దరు,ముగ్గురు ప్రముఖులు ఉన్నారన్నారు.వారి సూ చనల మేరకు తాను అప్పటి రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్ లో మాట్లా డడం జరిగింది.టికెట్ల ధరల విషయం మంత్రితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చె ప్పారు.ఆ తర్వాత ఓ రోజు మంత్రి నాకు ఫోన్ చేసి “ముఖ్యమంత్రి ముందు మీతో ఒన్ టు ఒన్ కలుస్తానని చెప్పారు.లంచ్ కి రావాలని చెప్పారంటూ” సమయం ఇచ్చారు. ము ఖ్యమంత్రి ఆహ్వానం మేరకు తాను ఆయన నివాసానికి వెళ్లినట్లు చెప్పారు.తనను వారు సాదరంగా ఆహ్వానించారు.లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల ను ముఖ్యమంత్రికి వివరించామన్నారు.ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అ నుకుంటున్నారని,సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను.కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్నినాని ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున,ఐ దుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు.ఆ సమయంలో ఓ పదిమందిమి వస్తా మని చెబితే సరేనని అన్నారు.రోజు ప్రకటించారు.అప్పుడు నేను బాలకృష్ణని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను.ఆయన అందుబాటులోకి రాలేదు.జెమిని కిరణ్ ని వె ళ్లి బాలకృష్ణని కలవమని చెప్పాను.ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణని కల వలేకపోయారు.దాంతో తాను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్.నారాయణ మూర్తితో సహా మరి కొంతమంది వెళ్లి ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలియచేశారు.ఆ సమయంలో నేను ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను.సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను.అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే.నే ను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపు దలకు అంగీకరించింది.ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది.ఆ నిర్ణ యం వల్ల మీ వీరసింహా రెడ్డి సినిమాకైనా,తాను నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకై నా టికెట్ ధరలు పెంచడానికి కారణమైంది.తద్వారా ఇటు నిర్మాతలకు,అటు డిస్ట్రిబ్యూట ర్లకు,ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది.తాను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా,సామాన్యుడితో నై నా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాన ని పేర్కొన్నారు.తాను ప్రస్తుతం ఇండియాలో లేకపోవడంతో పత్రికా ప్రకటన ద్వారా జరి గిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నట్లు చిరంజీవి లేఖ ద్వారా తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...