కలిసి బతకడం కష్టమనుకున్నారు... కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చారు... ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు...
కలిసి బతకడం కష్టమనుకున్నారు కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చారుఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు
ప్రేమ పెళ్లి పెద్దలు అంగీకరించలేదనే మనస్థాపంలో ఒక ప్రేమ జంట ట్రైన్ కిందపడి ఆత్మహ త్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.రైల్వే ట్రాక్‌పై యువతీ,యు వకుల మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసు కొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.మృతులు గుంటూరు ముప్పాళ్ళ మండలం,దమ్మాలపాడుకు చెందిన గోపి,తెనాలి మండలం,అత్తోటకు చెందిన లక్ష్మీ ప్రి యాంకలుగా గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోపీ,ప్రియాంక ఇద్దరూ నరసరావుపేటలోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీరి ద్దరికీ గత కొంత కాలంగా కాలేజ్‌లో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాస్తా ప్రేమ గా మారింది.దీంతో గత కొన్నేళ్లు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.ఇదే విషయాన్ని ఇరు వురు ఇళ్లలో తల్లిదండ్రులకు చెప్పారు.కానీ వాళ్లు ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు.ఇక వీ ళ్లు ఎప్పటికీ తమ పెళ్లి ఒప్పుకోరని నిర్ణయించుకున్న ఇద్దరూ ఈనెల 5వ తేదీన రహ స్యంగా పెళ్లి చేసుకున్నారు.తర్వాత నేరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.దీంతో పోలీసులు రెండు కుంటుంబాలను స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.కానీ,రెండు కు టుంబాలు వాళ్ల పెళ్లిని నిరాకరించాయి.దీంతో మనస్తాపానికి గురైన గోపి,ప్రియాంక వీ ళ్లు మనని కలిసి బతకనివ్వరని...చనిపోవడమే ఉత్తమమని సంచలన నిర్ణయం తీసు కు న్నారు.అయితే గోపి ప్రియాంకకు తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లి రైల్వే ట్రాక్‌పై పడి ఆ త్మహత్య చేసుకున్నాడు.గోపీ మరణవార్త విన్న ప్రియాంక కూడా మరుసటి రోజూ అదే ట్రాక్‌పై పడి ఆత్మహత్యకు పాల్పడింది.విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృత దే హాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment