పగబట్టిన పేదరికంతో పోరాటం...కుటుంబం మొత్తం కరోనాకు బలి...చివరి ప్రయత్నంలో డిఎస్సి సాధించిన రాంబాబు...
పగబట్టిన పేదరికంతో పోరాటంకుటుంబం మొత్తం కరోనాకు బలిచివరి ప్రయత్నంలో డిఎస్సి సాధించిన రాంబాబు
బియ్యం షాపులో పనిచేస్తూ టీచర్ అయ్యాడు.కుటుంబం మొత్తాన్ని కరోనా పొట్టన పె ట్టుకుంది.44ఏళ్లు వచ్చినా ఎవరూ పెళ్లిచేసుకోలేదు.పగబట్టిన పేదరికంతో పోరాటం చే శాడు.కంటతడి పెట్టించే రాంబాబు సక్సెస్ స్టోరీ...తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూ లీలు.పిల్లలను చదివించే స్థోమత లేదు.చందాలు పోగేసుకుని చదువు కన్నాడు.పేదరికం జయించడానికి ఉద్యోగం సాధించాలని నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు.ప్రతి డీఎస్సీ పరీక్షల్లోనూ ఏదో ప్రమాదం ముంచుకొచ్చేది.ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది.క రోనా మహమ్మారి వచ్చి తండ్రిని,అక్కను,అన్నయ్యను తీసుకెళ్లిపోయింది.ఒంటరి వాడై పోయాడు.నలభై నాలుగేళ్ళు వచ్చినా పిల్లని ఇస్తానన్న వాళ్ళు ఎవరూ లేరు.ఆశలన్నీ ఆవిరై పోయాయి.బియ్యం షాపులో కూలీగా పని చేసేవాడు.ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించింది.ఇతనికి చివరి అవకాశం మిగిలింది.ప్రయత్నించాలా..? మానే యాలా...? అనే మీమాంస.ఏదైతే అయిందని కొద్ది రోజులు పని మానేసి చదువుపై దృష్టి పెట్టాడు.కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక స్థోమత లేదు.తెలిసిన వారి దగ్గర పుస్తకాలు తీసు కుని చదువుతూనే ఉన్నాడు.అది ఏ స్థాయిలో అంటే ఇతనిపై పగబట్టిన పేదరికం కూడా జాలిపడేలా చదివాడు.చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మండపేట మండలం,ఏడిది గ్రామానికి చెందిన బొమ్మాలి రాంబాబు ప్రభు త్వ ఉపాధ్యాయ కొలువు సాధించారు అది ఎలాగో పరిశీలిద్దాం...ఆయన తల్లి,దండ్రులు సంగయ్య,సుజనమ్మలు సుమారు 50సంవత్సరాల క్రితం బొబ్బిలి నుంచి ఉపాధి కోసం మండపేట వచ్చారు.అయితే మండపేట పట్టణంలో ఇంటి అద్దెలు భరించలేక సమీపంలో ఏడిద చేరుకున్నారు.తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవన సాగిం చేవారు.సుమారు 40ఏళ్ల క్రితం అప్పుటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇల్లు లేని వారికి కట్టించిన కాలనీ ఇల్లు(పెంకుటిల్లు) ఇచ్చారు.ఇప్పటికీ పెంకులూడిపోయిన ఆ ఇల్లే ఆధా రం.వీరికి ముగ్గురు కుమారులు,ముగ్గురు కుమార్తెలు.అయితే వీరిని చదివించడం సా ధ్యం కాదని పెద్దబ్బాయిని బొబ్బిలిలోని వాళ్ళు బంధువులకు ఇచ్చేశారు.ఇద్దరు అబ్బాయిలను కూలి పనులకు తీసుకెళ్లకుండా చదివించడం మొదలుపెట్టారు.అలా పదో తరగతి రాంబా బు,రమేష్ సోదరలు పూర్తి చేశారు.రాంబాబుకు రమేష్ అన్నయ్యతో పాటు స్నేహితుడు కుడా అని చెప్పాలి.మీరు వలస రావడం వల్ల వీరికి ఇక్కడ బంధువులు ఎవరు ఉండేవారు కాదు.అలాగే స్నేహితులు కూడా లేకపోవడంతో అన్నయ్యలోనే స్నేహితులను చూసుకు నేవాడు.ఇంటర్మీడియట్ మండపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివేందుకు ఎంపీసీ గ్రూప్ కు దరఖాస్తు చేశారు.అయితే ఆ తండ్రి ఎంపీసీ గ్రూప్ కి ఖర్చు ఎక్కువవుతుంది చది వించలేను,సిఇసి తీసుకోమని చెప్పాడు.అయితే మండపేట కాలేజీలో ఆ సీట్లు పూర్తయి పోయాయి.దీంతో కడియం మండలం,మురమండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ లో చేరారు.ఏడిద నుండి సైకిల్ పై మురమండ వెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేసారు.ఆ త ర్వాత మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కళాశాలలో బిఎ ఉత్తీర్ణత సాధించారు. అలాగే శ్రీ కాకుళంలో ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు.అనంతరం రాంబాబు బీఈడీకి ఎంట్రన్స్ పరీక్ష రాశారు.మచిలీప ట్నం నేషనల్ కళాశాలలో సీటు వచ్చింది.కాని చదువుకోవడానికి మాత్రం డబ్బు లేవు.ఈ కుర్రాడు పరిస్థితి చూస్తుండే ఏడిది రధం వీధిలో ఉండే రాజు మాస్టర్ ప్రోత్సహించారు.బీ ఈడీ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి కొంత ఆర్థిక సాయం చేసి ఆ గ్రామ కొత్తపేట ఎ లిమెంటరీ స్కూల్లో పనిచేసే ప్రసాద్ మాస్టారుకు పరిచయం చేశారు.అక్కడ ఆ మాస్టర్ తో పాటు దుళ్ల గ్రామానికి చెందిన కంటిపూడి సత్యనారాయణ మాస్టారులు దాతలు వద్ద కు తీసుకెళ్లారు.ప్రసాద్ మాస్టారు తన మోటార్ సైకిల్ పై రాంబాబుని అర్తమూరు సత్తి బు లిస్వామి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్,ఆలమూరు సమతా స్వచ్ఛంద సేవా సంస్థ,రావులపాలెం రాఘవేంద్ర కంటి ఆసుపత్రికి చెందిన ట్రస్ట్ ద్వారా కొంత నిధులను సమకూర్చి బీఈడీ పూ ర్తి చేయడానికి కారకులయ్యారు.అప్పటి నుంచి టీచర్ అవ్వటానికి రాంబాబు చేయని ప్ర యత్నం అంటూ లేదు.2008 డీఎస్సీ తొలి ప్రయత్నంలోనే ఎంపికయ్యాడు.సర్టిఫికెట్లు ప రిశీలన కూడా పూర్తయింది.నియామక ఉత్తర్వులు రావడమే ఆలస్యం.ఇంతలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో కొందరి ఉద్యోగాలు తారుమారయ్యాయి.అటువంటి దురదృష్టవంతుల లో ఈ రాంబాబు ఉండటం బాధాకరం.ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.ఇక 2012లో డీఎస్సీపరీక్షలకు సిద్దమవుతుండగా తల్లి సుజనమ్మకు గుండెపోటు వచ్చింది.ఆ సుపత్రిలో తల్లిని చూసుకోవడంలో ఉండిపోయాడు.చివరకు ఆమె మరణించింది.అటు వంటి పరిస్థితుల్లో ఆ పరీక్షల్లో విజయం సాధించలేకపోయారు.అంటే అతన్ని దురదృష్టం ఏవిధంగా వెంటాడుతుందో చూడండి.2018 డీఎస్సీ పరీక్ష సిద్దమవుతయండగా తండ్రి సంగయ్య ప్రమాదంలో కాలు విరిగిపోయింది. అతన్ని సంరక్షణ చూసుకుంటూ ఆసుపత్రి లో ఉండిపోవడం వల్ల ఆ పరీక్షల్లో కూడా గెలవలేకపోయారు.ఇతను ఎమ్‌ఎ,బిఈడీ చద వడం వల్ల పలు కాన్వెంట్లు,ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూ ఉండేవారు.ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా యావత్తు ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఈ కుటుంబాన్ని పొట్టనపెట్టుకుంది.తండ్రి సంగయ్య,అక్క బొత్సా లక్ష్మీ,స్నేహితుడు లాంటి అన్నయ్య రమే ష్ లు రెండు వారాల వ్యవధిలోనే రాంబాబు కళ్లముందే మృతి చెందారు.ఒంటరి వాడైపో యాడు.మానసిక ఒత్తిడి ఎక్కువైంది.అలాంటి పరిస్థితుల్లో మరో అక్క రాజాన సుందరమ్మ ఏడిద వచ్చి రాంబాబుకు వండి పెడుతున్నారు.ఎంత చదువు చదివినా పెళ్లి చేసుకోవడా నికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి.దుర్బలమైన ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తున్నందున వీరిని చూశావారెవరు లేకుండా పోయారు.కనీసం జాలి పడేవారు కూడా లేరు.ఇతని దారిద్రం తమకు ఎక్కడ అంటుకుంటుందోనని దూరం దూరంగా ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలమూరు మండలం,చెముడులంక హైస్కూల్ పక్కన ఉన్న గుప్తా రైస్ స్టోర్ లో పనికి చేరాడు.ఇతని చదువును చూసి ఆ యాజమాన్యం బరువు పనులు చెప్ప కుండా తేలికపాటి పనుల బాధ్యతలు ఇచ్చేవారు.ఎంతో నమ్మకంగా పనిచేయడం తో వారు రాంబాబును పనివాడుగా కాకుండా ఆప్యాయతగా చూసుకునే వారు.సైకిల్ పై నే ఏడిద నుంచి చెముడు లంక రోజు వెళ్లి వచ్చేవారు.ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీని ప్రభు త్వం ప్రకటించింది.దీంతో యాజమాన్యం కొంతకాలం పని మానేసి చదువుకోమని సూ చించారు.అయితే కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక పరిస్థితులు లేకపోవడం వల్ల తెలిసిన వారి వద్ద పుస్తకాలు తీసుకుని రేయింబవళ్ళు చదువుతూనే ఉన్నాడు.అంటే కసి అనేదాని కి చివరి దశ అన్న మాట.ఆ స్థాయిలో చదివారు.అలా చదవడం కూడా ప్రమాదమే కదా. అదే జరిగింది.ఇంట్లోనే పడిపోతూ ఉండేవాడు.ఇదేంటని ఆసుపత్రి తీసుకెళ్తే ఇతనికి ఎ క్కువగా చదువుతూ ఉండటం వల్ల నిద్రలేక కంటికి రెట్టిగో అనే వ్యాధి సోకింది రెస్ట్ కావా లన్నారు.అంతే మళ్ళీ తన పని అయిపోయింది అనుకున్నాడు.అలాగే మందులు వాడుతూ ఆ చదువును కొనసాగితూ వచ్చాడు. ఎక్కడా నిరుత్సాహం అనేదాన్ని తన దరిదాపుల్లోకి రానీయకుండా చూసుకున్నాడు.చివరకి అమలాపురం సమీపంలోని శ్రీనివాస ఇంజనీ రింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వెళ్లాడు.పరీక్షా రాస్తూనే మధ్యలో కుప్పుకూలి పో యాడు.ఇన్విజిలేటర్లు ఏంటి విషయమని ఆరా తీశారు.పరిస్థితి వివరించాడు.మందులు వేసుకుని మళ్లీ పరీక్ష రాయడం మొదలు పెట్టాడు.ఆ విధంగా సుమారు 15నిమిషాలు పరీ క్ష సమయం వృధా అయిపోయింది.ఈ పరిస్థితుల్లో ఈ పరీక్ష కూడా గెలవలేననే నిర్ణ యానికి వచ్చేశారు.కాని ఫలితాలు చూస్తే పూర్తిగా రాంబాబు వైపుకు వచ్చేశాయి.ముందు గా చెప్పాను కదా ఇతన్ని వెంటాడిన పేదరికం,దారిద్రం వంటివన్నీ జాలిపడ్డాయి.ఇక అత న్ని ఇబ్బంది పెడితే అర్థమే ఉండదనుకున్నాయి.అందుకునే ఒకే పరీక్షలో రెండు ఉద్యోగా లకు సెలెక్ట్ అయ్యారు.వాటిల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్( ఎస్సీ కేటగిరీలో 75వ రోస్టర్ పాయింట్)ను ఎంచుకున్నాడు.దీనితో పాటు టిజిటి 138వ ర్యాంకు సాధించారు.చూ శారా...రాంబాబు జీవితంలో ఓడిపోయి,పడిపోయి మళ్లీ లేచి ఎలా నిలబడ్డారో.యావ త్తు ప్రపంచానికి చాటి చెప్పింది ఏంటంటే నిరుత్సాహాన్ని దరిచేరనీయకుండా కష్టపడి చ దివితే లక్ష్యం చేరుకోవచ్చని.రాంబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని,కష్టాలు మంచి బయటపడి మరి కొంతమంది యువకులకు సాయం చేసే స్థాయికి చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుం దాం.
Comments
Post a Comment