ఆయుర్వేదంపై అవగాహన సదస్సు...డాక్టర్ ఎస్.లలిత,కళాశాల ప్రిన్సిపల్...
ఆయుర్వేదంపై అవగాహన సదస్సుడాక్టర్ ఎస్.లలిత,కళాశాల ప్రిన్సిపల్
బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ఆయు ర్వేదంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సి పల్ డాక్టర్ ఎస్.లలిత మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రాముఖ్యత,విద్యార్థులు ఏ విధమైన జీ వన శైలికి అలవాటు పడాలనే విషయాలను వివరించారు.ప్రశాంతమైన మనసు,వాతా వరణం రెండు మనిషి ఆయుష్షును పెంచుతాయని తెలియజేశారు.మన వంట ఇంటిలోని అనేక ఆయుర్వేద మూలికలను గుర్తు చేశారు.అదేవిధంగా ఆయుర్వేద మొక్కల పెంపకా న్ని ప్రోత్సహిస్తూ వాటి ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చని విద్యార్థులకు సూ చించారు.బనగానపల్లె,ఆయుర్వేద హాస్పిటల్,సీనియర్ మెడికల్ అధికారిణి డాక్టర్ టి.వా ణి మాట్లాడుతూ చరక సంహిత నుండి ఇప్పటి వరకు మనం నిత్యం అనుసరించే ఆయు ర్వేద విధానాలను,పంచకర్మ విధానాలను వివరించారు.గోల్డెన్ మిల్క్,పోషక విలువలతో నిండిన ఆహారాన్ని భుజిస్తూ, సానుకూల దృక్పథంతో ఉండటం ఆయుర్వేదంలో భాగమని తెలియజేశారు.వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వసుంధర మాట్లాడుతూ కరోనా సమ యంలో మనం ఉపయోగించిన ఆయుర్వేద మూలికలను గుర్తుచేశారు.అదేవిధంగా మ న చుట్టూ ఉన్న ఆయుర్వేద మొక్కలు వాటి ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమం లో అధ్యాపకులు డాక్టర్ బడే సాహెబ్,డాక్టర్ మహమ్మద్ గౌస్,ఉమామహేశ్వర్ రెడ్డి, డా క్టర్ సుధాకర్ రెడ్డి,డాక్టర్ రామకృష్ణ,డాక్టర్ నీతమ్మ,కౌసల్యాదేవి,రవి,రామన్న,తిమ్మయ్య, వరలక్ష్మి,హెర్బెరియం కీపర్ హఫీజ్,ఇతర అధ్యాపక,అధ్యాపకేతరులు,విద్యార్థినీ,విద్యార్థు లు పాల్గొన్నారు.
Comments
Post a Comment