జిల్లా బాలల పరిరక్షణ విభాగం,శక్తి టీం ఆధ్వర్యంలో ఫోక్సో యాక్ట్,జేజే యాక్ట్ పై అవగాహన...సిఐ విజయలక్ష్మి,జిల్లా శక్తి టీమ్...
జిల్లా బాలల పరిరక్షణ విభాగం,శక్తి టీం ఆధ్వర్యంలో ఫోక్సో యాక్ట్,జేజే యాక్ట్ పై అవగాహనసిఐ విజయలక్ష్మి,జిల్లా శక్తి టీమ్
శక్తి టీమ్,కర్నూలు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు న గరంలోని స్థానిక వ్యాసు ఆడిటోరియం నందు ఫోక్సొ యాక్ట్,జువైనల్ జస్టిస్ యాక్ట్ మరి యు వీర్ బాల్ దివాస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భం గా జిల్లా శక్తి టీమ్ సిఐ విజయలక్ష్మి మాట్లాడుతూ బాలబాలికలపై జరుగుతున్న లైంగిక వే ధింపుల నుండి రక్షించడానికి ఈ చట్టం 2012లో తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ చట్టం ద్వారా బాల బాలికలపై లైంగి వేధింపుల నుండి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.బాల బాలికలపై ఎక్కడైనా లైంగిక నేరాలకు పాల్పడితే ఫిర్యాదులు చేయడానికి నేరుగా పోలీస్ స్టేషన్లో వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా ఈ బాక్స్ ఏర్పాటు చేయ డం జరిగిందని,పోలీస్ స్టేషన్లో, కోర్టులలో కూడా ఫిర్యాదు చేయడానికి చేసే విధంగా పిల్లలకు స్నేహపూర్వకంగా వాతావరణ కలిగించడానికి ఈ పోక్సో యాక్ట్ ఉపయోగప డుతుందని అన్నారు. బాలికలపై వెకిలి చేష్టాలు ద్వారా గాని,అసభ్యకరమైన పదాలుగానీ, కామెంట్ చేయడం మొదలైన చేష్టలు చేసిన గాని వారిపై ఫోక్సో యాక్ట్ నమోదు చేయ వచ్చని పేర్కొన్నారు.ముఖ్యంగా బాల బాలికలపై తమపై జరిగిన వేధింపులు చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా సెక్షన్ 25 ప్రకారం మేజిస్ట్రేట్ ద్వారా బాలికల స్టేట్మెంట్ ను రి కార్డు చేయడానికి కూడా వెసులుబాటు ఉంటుందని అన్నారు.డిసిపిఓ శారద మాట్లాడు తూ ఆధునిక యుగంలో గురు గోవింద్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని యువత ధైర్యం,ని జాయితీ,విలువలు తమ జీవితంలో అలవాటు చేసుకోని తమ భవిష్యత్తును ఉన్నతమైన సాయికి ఎదిగే విధంగా యువత కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించడం జరిగిం ది.18సంవత్సరాలులోపు బాల బాలికలు ఎవరైనా నేరాలకు గురైనప్పుడు అలాంటి వారి ని బాలల న్యాయమండలి (జేజేబి) ముందుప్రవేశ పెట్టడం జరుగుతుందని తెలిపారు.బాల బాలికలపై జరిగిన నేరాలు రుజువు అయ్యేంతవరకు వారిని పరిశీలన గృహాలలో ఉంచ డం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శక్తి టీటీమ్ సిబ్బం ది,ఎల్సిపిఓఓ శ్రీలక్ష్మి,ఓఆర్ డబ్ల్యు రంగమ్మ,ఒఎస్ సి సిబ్బంది సి.ఏ మేరీ స్వర్ణలత,జోష్ణ, సునీత,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment