ఒకే ఒక్క అరెస్ట్...హైకోర్టులో జైభీం మూవీ సీన్ రిపిట్...యునిఫాం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?...హైకోర్ట్ వ్యాఖ్యల పట్ల ప్రజలు హర్షం..
ఒకే ఒక్క అరెస్ట్...హైకోర్టులో జైభీం మూవీ సీన్ రిపీట్యూనిఫాం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?హైకోర్ట్ వ్యాఖ్యల పట్ల ప్రజలు హర్షం
సౌందర్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసుల వైఖరిని ఏపీ హైకోర్టు ఎండగట్టింది.మఫ్టీలో వెళ్లి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించింది.22వ తేదీన ఐదు గంటల సమయంలో అదు పులోకి తీసుకున్న నాటి నుంచి అర్దరాత్రి 12-00 గంటల వరకు మొత్తం సీసీ కెమెరాలను ఫుటేజ్,పోలీసుల అదుపులో ఉన్న రెండు రోజుల సెల్ టవర్ లొకేషన్ సైతం తమ ముం దు ఉంచాలని టెలికాం కంపెనీనీ అదేసించింది.వివరాలు ఇలా ఉన్నాయి...నెల్లూరు జిల్లా కు చెందిన సౌందర్ రెడ్డి తాడేపల్లి వచ్చి చెన్నై కలకత్త జాతీయ రహదారి సమీపంలో రో డ్డు పక్కన జ్యూస్ స్టాల్ నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన తాడేపల్లి పా తూరు రోడ్డులో సౌందర్ రెడ్డిని పోలీసులమని చెప్పి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తుం డగా బలవంతంగా మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఎందుకు అరెస్టు చే శారో చెప్పాలని ప్రశ్నించగా...యాక్సిడెంట్ కేసులో అరెస్టు చేస్తున్నామని,తాము తాడే పల్లి పోలీసులమనీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.దీనితో తాడేపల్లి పోలీసులను సౌందర్ రెడ్డి భార్య ఆశ్రయించిన ఫలితం లేకపోయింది.100కు కాల్ చేసిన పోలీసులు స్పందించలేదు.ఆమె నేరుగా ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిం ది.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ రఘునందన రావు,జస్టిస్ చంద్ర దనశేఖర్ల ధ ర్మాసనం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.మొదట పోలీసులమని చెప్పి అరెస్టు చేశారని కోర్టుకు బాధిత కుటుంబ సభ్యులు తెలపగా పోలీసులు మాత్రం అరెస్టు చేయలే దని ఏపీ హైకోర్టుకు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ తరపు న్యాయవాదులు,హెబియ స్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.బాధితుడు ఎ క్కడ ఉన్నారో 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలని,అలాగే ఏ కేసులో అయినా అరె స్టు చేస్తే ఆ కేసుకు సంబంధించిన వివరాలతో ఏ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.అయితే సౌందర్ రెడ్డి తమ అదుపులో లేడని హైకోర్టుకు నివేదించారు.అయితే అనూహ్యంగా 23వ తేదీన గుంటూరు జిల్లా,పత్తిపాడు పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించేందుకు సిద్ధమయ్యా రు.హైకోర్టులో బాధితుడి బార్య ఆధారాలతో సహా లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చే యడంతో 24వ తేదీన తమ ఎదుట హాజరు పర్చాలని ఆదేశించింది.పైగా తమ అదుపులో లేరని తాడేపల్లి పోలీసులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మిస్సింగ్ కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది.ఈ కేసులో వాస్తవాలు ఏంటో తేలుస్తామని విచారిం చిన ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడింది.కోర్టు ఆదేశాలతో అన్ని ఆధా రాలను కోర్టు పరిశీలించడంతో పోలీసుల తీరును తప్పుపట్టింది.అక్రమంగా అరెస్టు చే యడం యూనిఫారం లేకుండా అరెస్టు చేయడం,హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కూడా గం జాయి కేసులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచడం లాంటి అంశాలను పరిశీలించి తీవ్రం గా మండిపడింది.హైకోర్టు,సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు పట్టవా అంటూ పత్తిపాడు సీఐను నేరుగా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.సివిల్ దుస్తుల్లో అదుపులోకి తీసుకుంటు న్నారు? ఇదేం సంస్కృతి? అంటూ ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మరోవైపు ఈ కేసును మూడు రోజులుగా సుదీర్ఘంగా విచారించిన ఏపీ హైకోర్టు ఎన్నడూ లేని విధంగా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.సౌందర్ రెడ్డి అరెస్టును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.తనను అక్రమంగా అరెస్టు చేశారని,అన్యా యంగా గంజాయి కేసులో ఇరికిం చారని హైకోర్టులో న్యాయమూర్తుల ఎదుట భావోద్వేగానికి గురవడంతో ఈ కేసులో అ స్సలు వాస్తవాలు ఏంటో తేల్చాలని విశాఖ సీబీఐ యూనిట్ ను ఆదేశించింది.పౌరులను అక్రమంగా అరెస్టు చేస్తే చూస్తూ ఊరుకోమని నిజా నిజాలు ఏంటో తేల్చాలని CBIకి కే సును అప్పగించింది.సౌందర్ రెడ్డిని 22వ తేదీన అదుపులోకి తీసుకున్న పత్తిపాడు పోలీ సులు తమ అదుపులో లేడని చెప్పడం,పోలీసుల వెర్షన్,బాధితుడు సీసీ ఫుటేజ్,సెల్ లొకే షన్లు బిన్నంగా ఉండటం,పత్తిపాడు పోలీసులు గంజాయి కేసు నమోదు చేయడం,తమ ఆదేశాలకు విరుద్ధంగా లోకల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచడం,22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొత్తం వ్యవహారంలో పోలీసులు కోర్టుకు నివేదించిన అంశాలు భిన్నంగా ఉండడంతో సీబీఐకి అప్పగిస్తూ వచ్చే నెల 13వ తేదీలోపు కేసులో వాస్తవాలను విచారిం చి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.మొత్తానికి ఏపీ పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది.అక్రమ అరెస్టుల విష యంలో తొలిసారి ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చిందని న్యాయనిపుణులు,పజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సీబీఐ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించిన తరు వాత పోలీసులు నిజంగా తప్పు చేసినట్లు తేలితే హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇప్పుడు సంచలనంగా మారింది.ఈ కేసులో సీబీఐ విచారణ ఎలా జరగబోతుంది,దీనిపై సీబీఐ ఏ నివేదిక ఇస్తుంది అనేది వేచి చూడాలి.
Comments
Post a Comment