బీసీ రిజర్వేషన్లు...హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

బీసీ రిజర్వేషన్లు...హైకోర్టు కీలక వ్యాఖ్యలు

VS9TV న్యూస్,హైదరాబాద్‌ : 
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు శనివారం విచారణ జరిపింది.హౌస్‌ మోషన్‌ పిటి షన్‌ విచారించేందుకు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ ఏర్పాటు చేశారు.జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి,జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌లతో ఏర్పాటైన బెంచ్‌ విచారణ చేపట్టింది.పిటిషనర్‌ తరఫున సీనియ ర్‌ న్యాయవాది మయూర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు.రిజర్వేషన్లు 50 శాతం దాట డం...రాజ్యాంగ విరుద్ధమని...స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం దాటకూడ దని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని మయూర్‌రెడ్డి వివరించారు. ప్రభుత్వం తరపున ఏ జీ వర్చువల్‌గా హాజరుకాగా...బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని ఆయ న పేర్కొన్నారు.తమిళనాడులో రిజర్వేషన్లు 50శాతం మించినట్టు ఉందని హైకోర్టు ప్రస్తా వించింది.బీసీ బిల్లు గవర్నర్‌ దగ్గరికి ఎప్పుడు వెళ్లిందంటూ ధర్మాసనం ప్రశ్నించగా...గ వర్నర్‌ దగ్గరకు బిల్లు వెళ్లి నెలరోజులు దాటిందని ఏజీ సమాధానమిచ్చారు.గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీఓ ఎలా ఇస్తారు?. రిజర్వేషన్లు పెంచుతూ జీఓ ఎలా ఇ స్తారు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది.మేం జోక్యం చేసుకోవద్దంటే...ఎన్నికలకు వెళ్లమని హామీ ఇవ్వండి.10రోజుల వరకు ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టమని హామీ ఇవ్వాలన్న ధ ర్మాసనం...ప్రభుత్వం ఆలోచన ఏంటో ఏజీ చెప్పాలని పేర్కొంది.ఎన్నికల నోటిఫికేషన్‌ వ చ్చిన తర్వాత పిటిషన్లు దాఖలైతే కోర్టులు జోక్యం చేసుకోలేవు.ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే...పిటిషన్లు ఉన్నాయి కాబట్టి విచారించవచ్చు'' అని హైకోర్టు పేర్కొంది.విచారణ అక్టోబర్‌,8కి వాయిదా వేసిన ధర్మాసనం...తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చే సింది.బీసీలకు 42శాతం రిజర్వేషన్ల జీఓను సవాల్‌ చేస్తూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, మూడు చింతలపల్లి మండలం,కేశవాపూర్‌ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి మ రోసారి రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు.మూడు రోజుల క్రితమే రిజర్వేషన్లపై ఆ యన పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.అయితే,మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్‌ ఎలా వేశారంటూ హైకోర్టు పిటిషన్‌ను కొట్టి వేసింది.ఈ క్రమంలో బీ సీలకు రిజర్వేషన్లు పెంచుతూ గత శుక్రవారం జీఓ విడుదల చేసింది.దీనిని సవాల్‌ చేస్తూ మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...