అమ్మవారి వెండి సింహాలు అమ్మేసుకున్నారు...చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి...
అమ్మవారి వెండి సింహాలు అమ్మేసుకున్నారుచంద్రబాబు నాయుడు,ముఖ్యమంత్రి
తెలుగు వారి ఇలవేల్పు...కనక దుర్గమ్మ సన్నిధిని కూడా గత పాలకులు అపవిత్రం చేశా రు.వెండి సింహాలు ఎత్తుకుపోయి అమ్ముకున్నారు.ఇష్టానుసారంగా వ్యవహరించారు.దు ర్గమ్మ ఆలయంలో అపవిత్ర కార్యక్రమాలు జరిగినా...దొంగతనాలు జరిగినా నిమ్మకు నీరె త్తినట్టు వ్యవహరించారు.ఏం చెప్పాలో తెలియడం లేదు.దుర్గమ్మ సన్నిధిలో అలాంటి దు ర్మార్గుల గురించి మాట్లాడడం దురదృష్టకరం.అయినా...తప్పడం లేదు.అందుకే అలాంటి దుర్మార్గులను దుర్గమ్మే అధికారం నుంచి దించేసింది.సుపరిపాలనను రాష్ట్రానికి అందిం చాలని మమ్మల్ని ఆశీర్వదించింది.అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.దసరా శరన్న వరాత్రులను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల్లో సీ ఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సమేతంగా పాల్గొన్నారు.సోమవారం సాయంత్రం 4-00 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆయన..సరస్వతీ రూపంలో దర్శనమిచ్చిన దుర్గ మ్మను దర్శించుకున్నారు.అనంతరం..ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమ ర్పించారు.అనంతరం అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు.తర్వాత...మీ డియాతో మాట్లాడిన సీఎం...గతంలో తాను తొలిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పటికీ...ఇ ప్పటికీ...అనేక మార్పులు తీసుకువచ్చామన్నారు. అప్పట్లో ఇరుగ్గా ఉన్న ఆలయాన్ని విస్త రించామని తెలిపారు.ప్రస్తుతం ఉన్న విస్తరణలన్నీ...గతంలో తాము చేసినవేనని తెలిపా రు.ఈ సందర్భంగా ఆయన వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను పరోక్షంగా విమర్శించారు.ఇక్కడే ఒక నాయకుడు ఉండేవాడు.ఆయన వ్యాపారి.అన్నీ వ్యాపార దృష్టితోనే చూసేవాడు.దీంతో సామాన్యులకు అమ్మవారి దర్శనం దుర్లభంగా మారింది.దసరా వచ్చిందంటే...కమీషన్ల కోసం ఎగబడే వారు.వెండి సింహాలను ఎత్తుకు పోయి అమ్ముకున్నారు.చెప్పుల స్టాండ్ల టెండర్లను కూడా సొంత వారికి ఇచ్చి వ్యాపారం చేశారు.ఇన్ని దురాగతాలు చేశారు కాబట్టే...అమ్మ వారు వారిని తన్ని తరిమేసింది.అని వ్యాఖ్యానించారు.దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడడం తనకు ఇష్టం లేకపోయి నా...తప్పని పరిస్థితిలో చెప్పాల్సి వస్తోందన్నారు.ఇక,రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కన క దుర్గమ్మను కోరుకున్నట్టు సీఎం తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు.గత 15మాసాలుగా రాష్ట్రంలో సుపరిపాలన అం దుతోందన్న సీఎం...రాబోయే రోజుల్లో ప్రజలకు మరింతగా ప్రభుత్వం చేరువ అవుతుం దని తెలిపారు.ప్రస్తుత దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు.అమ్మ వారి ఆలయంలో మరిన్ని అభివృధ్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు.నూతన అన్నప్రసా ద భవన నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని అన్నారు.లడ్డూ ప్రసాదం తయారీకి తిరు మల తరహాలో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
Comments
Post a Comment