మోగిన తెలంగాణ స్థానిక ఎన్నికల నగారా...
మోగిన తెలంగాణ స్థానిక ఎన్నికల నగారా
తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది.ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ,గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చే సింది.మొదట జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని,ఆ తర్వాత గ్రామ పంచాయ తీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నిక కమిషనర్ రాణికుముదిని వెల్లడించారు.స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం ఐదు దశల్లో జరగనున్నట్లు ఆమె ప్రకటించారు.31జిల్లాల్లో 56 5 మండలాల్లో 5749 ఎంపీటీసీ,656 జెడ్పీటీసీ స్థానలకు ఎన్నికలు నిర్వహిస్తామని అ న్నారు.12,733 గ్రామపంచాయతీలు,1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్న ట్లు చెప్పారు అక్టోబర్,9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.అక్టోబ ర్,9వ తేదీ నుంచి ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు.అక్టోబర్,2 3న తొలివిడత,27న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.గ్రామ పంచాయతీల కు తొలి విడత ఎన్నికలు అక్టోబర్,31న,రెండో విడత నవంబర్,4న,మూడో విడత నవం బర్,8న జరగనున్నాయి.పోలింగ్ పూర్తయిన రోజే గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు జ రుగుతుంది.నవంబర్,11న ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Comments
Post a Comment