జిల్లాలో పర్యాటకం అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తాం...డాక్టర్ ఏ.సిరి,జిల్లా కలెక్టర్...

జిల్లాలో పర్యాటకం అభివృద్ధి చేయడానికి 
అన్నివిధాలా కృషి చేస్తాం
డాక్టర్ ఏ.సిరి,జిల్లా కలెక్టర్ 

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కర్నూలు జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని జి ల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప ర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ...ఈ ఏడాది ప్రపంచ పర్యాటక ది నోత్సవం ధీమ్ స్థిరమైన పర్యాటకం,పరివర్తన అని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడు కుంటూ టూరిజంను అభివృద్ధి చేసుకుందామని సూచించారు.జిల్లాలో రూ.14 కోట్లతో ఐదు టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారన్నారు. మనకు వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను,కొత్తగా ఏర్పాటు చేసుకునే పర్యాటక కేంద్రాలను కూడా ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.మనం ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నీరు త్రాగి మన ఆరోగ్యాన్ని,పర్యావరణాన్ని పాడు చేసు కుంటున్నామని దాన్ని వెంటనే ఆపాలని,అలాగే ఇళ్లలో,కార్యాలయాల్లో ఏసీ,కరెంటు వా డకాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని,పర్యాటక రంగం కూ డా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ తెలిపారు.
అనంతరం జిల్లా టూరిజం మరియు డివిజనల్ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడు తూ...స్పెయిన్ దేశంలో ప్రపంచ పర్యావరణ ఆర్గనైజేషన్ 45సంవత్సరాల కిందట ఏ ర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్,27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరు పుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రతి సంవత్సరం ఒక థీమ్ ప్రకారం జరుపుకోవడం జరుగుతుందని,ఈ సంవత్సరం టూరిజం మరియు సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్.దీని ప్రకా రం పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటూ సుస్థిరమైన మార్గంలో పయనించడం.ఉమ్మడి జిల్లాలో ప్రకృతి పరంగా పర్యాటక ప్రదేశాలు,సాం స్కృతిక పరంగా పర్యాటక ప్రదేశాలు ఉన్నవని వాటిని పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామని తద్వారా యువతకు ఉపాధి కలుగుతుందని జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.కర్నూలు జిల్లాలో శిల్పారామంను ఏర్పాటు చేస్తున్నా మని,స్థానికంగా హరిత హోటల్ ను పర్యాటకులను ఆకర్షించే విధంగా మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలియజేశారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో చి న్నారులు చారిత్రక వివరాలు తెలుపుతూ చేసిన నృత్య ప్రదర్శనలు,మోహన్ బాబు చేసి న డాన్సింగ్ డాల్స్ ప్రదర్శనలు,గురవయ్యల నృత్యం,కోలాటం ఆహుతులను అలరించా యి.అనంతరం జిల్లా కలెక్టర్ వారికి జ్ఞాపికలు అందజేశారు.ఈ సమావేశంలో డిఆర్ ఓ వెంకటనారాయణమ్మ,డిస్ట్రిక్ట్ టూరిజం డివిజనల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ,జడ్పి సిఈఓ నాసరరెడ్డి,హోసింగ్ పీడీ చిరంజీవి,సీఈఓ సెట్కూర్ వేణుగోపాల్ రెడ్డి,ఆర్ఐఓ లాలెప్ప, డిఎస్ఓ రాజా రఘువీర్,ఎస్ డిసి నాగప్రసూన లక్ష్మి,ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్డిసి కొం డయ్య,డిఆర్ డిఏ పీడీ రమణారెడ్డి,సీపీఓ భారతి,తహసీల్దారులు రమేష్ బాబు,రవి,శ్రీ నాథ్,టీజీవీ కళా క్షేత్రం కళారత్న పత్తి ఓబుళయ్య,టూరిజం శాఖ సిబ్బంది,ప్రజలు,విద్యా ర్థులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...