కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు...
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించారు.సంప్రదాయ వస్త్రధారణలో సతీసమే తంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు ఆనం రామనారా యణ రెడ్డి,కొల్లు రవీంద్ర,ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం సీఎం నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల తో పాటు పసుపు, కుంకుమ,పూలు,పండ్లు,గాజులను కూడా ఆయన అమ్మవారికి అర్పిం చారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు,నారా భువనేశ్వరి దం పతులకు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు.దర్శనానంతరం వారికి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు.ముఖ్యమంత్రి రాకతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెల కొంది.
Comments
Post a Comment