హంద్రీనది,వక్కెరవాగు పొంగడం వల్ల కల్లూరు నుండి కర్నూలుకు రాకపోకలు బంద్...
హంద్రీనది,వక్కెరవాగు పొంగడం వల్ల కల్లూరు నుండి కర్నూలుకు రాకపోకలు బంద్ ఎంతకాలం కల్లూరు ప్రజలకు అవస్థలువక్కెరవాగు,దేవనగర్ బ్రిడ్జిలు ఎత్తు పెంచి కొత్తగా నిర్మించాలిసిపిఎం డిమాండ్
కర్నూలు జిల్లాలో గత రెండు,రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా హంద్రీ నది ఉ దృతంగా ప్రవహించడంతో కల్లూరు ఒక్కెర వాగుకు వర్షపు నీరు అధికమై కల్లూరు నుండి కర్నూలుకు వెళ్లే ప్రయాణికులు ఎక్కడి వారు అక్కడ ఆగిపోవలసి వచ్చిందని సిపిఎం నా యకులు అన్నారు.సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం కల్లూరు,హంద్రీ నది,కల్లూరు ఒక్కెర వా గు బ్రిడ్జిని పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె. సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు జి.ఏసు,సిపిఎం నాయకులు జె.శ్రీనివాసులు,ఏ.గో విందు మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీ ఎ త్తున హంద్రీ నదికి వరద రావడం వల్ల దేవనగర్ కు వెళ్లే కాజ్వే మీదుగా నీరు ప్రవహించ డం వల్ల అక్కడ రాకపోకలు బంద్ అయ్యాయని చెప్పారు.దీనివల్ల ప్రజలు దాదాపు పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి కర్నూలు చేరుకోవాల్సి వస్తుందని అన్నారు. గత పది సంవత్సరాలుగా వైఎస్సార్ ప్రభుత్వం,టిడిపి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు,ఎంపీలు కా ర్పొరేటర్లు,కల్లూరు,కర్నూలు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణం కూడా చేసుకోలేని దుస్థితి కల్లూరు ప్రజలకు దాపురించిందని ఆవేదన చెందా రు.సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక్కెర వాగు బ్రిడ్జి ఎత్తు పెంచి,కొత్తగా బ్రిడ్జి నిర్మాణం చేప ట్టాలని అనేక రకాల ఆందోళనలు సంతకాల సేకరణలు,వినతిపత్రాలు ఎన్ని ఇచ్చినా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైన నిర్మాణం చేపట్టడంలో అధికార పార్టీ నాయకులు చొరవ చూపకపోవడం వల్ల చిన్న పాటి వర్షం కురిసిందంటే కల్లూరుకు ప్రమాదం పొంచి ఉంద ని,అటువైపు హంద్రీనది,ఇటువైపు ఒక్కెర వాగు రెండు కూడా కల్లూరుకు ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఇప్పటికే చెంచునగర్ కాలనీలో నీరు ప్రవేశించి ఇళ్లల్లోకి నీరు చేరిందని,అటువైపే వెళ్లేవారు ఇంట్లోకి కూడా వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు.వెంటనే ప్రభు త్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలు,కార్పొరేటర్లు స్పందించి దేవనగర్ కాజ్ వే బ్రిడ్జి ఎత్తు,కల్లూరు ఒక్కెర వాగుపై బ్రిడ్జి ఎత్తు పెంచి నిర్మాణం చేపట్టకపోతే రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని వారు హె చ్చరించారు.ఈ కార్యక్రమంలో నాగరాజు,రమేష్,షేక్షావలి,శ్రీనివాసులు,మురళి,ఎల్లరాజు ,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Comments
Post a Comment