అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని వీడండి...వెంటనే నోటీసులు జారీ చేసి,చార్జిషీట్ దాఖలు చేయండి...

అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని వీడండి
వెంటనే నోటీసులు జారీ చేసి,చార్జిషీట్ దాఖలు చేయండి
ఎల్‌ఆర్‌ఎస్ పథకం క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించండి
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశాలు

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని వీడాలని,వెంటనే నోటీసులు జారీ చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధి కారులను ఆదేశించారు.శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ భవనంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు,సిబ్బందితో కలిసి ఓపెన్ ఫోరం కా ర్యక్రమం నిర్వహించారు.పలువురు అర్జీదారులు తమ సమస్యలను చెప్పగా,జాప్యానికి కా రణాలను అడిగి,చట్టపరిధిలో వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారు లను ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ప్రతి సచివాలయ పరిధిలో సంబంధిత ప్లానింగ్ కార్యదర్శి,ఇతర కార్యదర్శుల సహాయం తీసుకుని అక్రమ నిర్మాణాలు గుర్తించాలని అన్నారు.అప్రూవల్ ఉందా? ప్లాన్‌ విరుద్ధంగా ఏమైనా నిర్మాణాలు చేస్తున్నా రా? చెక్‌లిస్ట్ ప్రకారం పత్రాలు ఉన్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు.అందుకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు వెంటనే నోటీసులు జారీ చేసి,చా ర్జిషీట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు.అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎ స్) పథకంపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విస్తృత అవగాహన కల్పించాలని కమిషనర్ సూ చించారు.ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్,డీసీసీ వెంకటరమణ,పట్టణ ప్రణాళిక అధి కారి అంజాద్ బాష,సూపరింటెండెంట్ సుబ్బన్న,సిబ్బంది అనంత వెంకటేష్,తదితరులు పా ల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...