రౌడీషీటర్లకు కొత్త సీపీ సజ్జనార్ హెచ్చరిక...
రౌడీషీటర్లకు కొత్త సీపీ సజ్జనార్ హెచ్చరిక
రౌడీషీటర్లపై గట్టి చర్యలు తప్పవని,హైదరాబాద్ లో ఎవరైనా రౌడీషీటర్లు హల్చల్ చేస్తే వా రిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ కొత్త సీపీ హెచ్చరించారు. చట్టం అందరికీ సమానమే అని అన్నారు.సోషల్ మీడియాలో అనర్ధాలకు దారితీసే పో స్టులు చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం.ఎవరైనా రాజకీయ నాయకులు,వారి అనుచరులు కూడా ఇలాంటి ప్రవర్తనకు పాల్పడకూడదు.ఎక్కడో జరిగిన సంఘటనను వక్రీకరించి పో స్టులు పెడితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.అయితే ఈ ప్రకటనలో రాజకీయ విశ్లేషకులు,ప్రజాసంఘాలు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాయి.చట్టం అం దరికి సమానమే అనే సూక్తి అందరికి తెలుసు...కాని...ఆ చట్టం పేరుతో జరుగుతున్న అ క్రమాలు అంతా ఇంతా కాదు.నేటి చట్టం రాజకీయ నాయకుల చేతుల్లో బందీ అయిం ది.దీని గురించి కూడా చెప్పింటే బాగుండేది అనేది మొదటి ప్రశ్న కాగా...ఇక రెండవ ప్ర శ్న...ఎక్కడో జరిగిన ఘటనలు వక్రీకరించి పోస్ట్ చేస్తే తప్పు...కాని తెలంగాణలో ప్రస్తు త ప్రభుత్వం నుండి బాధింపబడిన బాధితులు సోషల్ మీడియా ద్వారా తమకు జరుగు తున్న అన్యాయంను పోస్ట్ చేస్తే అంగీకరికరిస్తారా?ఆ బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారు అండగా నిలుస్తారా? అనే అంశాలపై కూడా పూర్తిగా తనలో ఉన్న అభిప్రా యం తెలిపేందుకు సిద్దంగా ఉన్నారా? అనే ప్రశ్నలు సందిస్తున్నారు.మరి...ఈ ప్రశ్నలకు సజ్జనార్ ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం...
Comments
Post a Comment