నిలిచిఉన్న ఆటోను ఢీకొన్న బియ్యం లారీ...ప్రమాదంలో ఇద్దరు మహిళలు,చిన్నారి మృతి...
నిలిచిఉన్న ఆటోను ఢీకొన్న బియ్యం లారీప్రమాదంలో ఇద్దరు మహిళలు,చిన్నారి మృతి
పత్తికొండ పట్టణంలో మంగళవారం నిలిచి ఉన్న ఆటోను బియ్యం లారీ వెనకనుంచి ఢీ కొనడంతో ఇద్దరు మహిళలు,ఒక చిన్నారి మృతి చెందిన ఘటన జరిగింది.వివరాలు ఇ లా ఉన్నాయి...తుగ్గలి మండలం,ముక్కెళ్ల గ్రామానికి చెందిన సుమన్ భార్య భూమిక (3 6),కుమార్తె నిఖిత (3),పవన్ భార్య శిరీష(35)లు పండగ సరుకుల కోసం ముక్కెళ్ల నుండి పత్తికొండకు ఆటోలో వెళ్లారు.బట్టలు,పండగ సరుకులు తీసుకుని ముక్కెళ్ల ఆటో స్టాండ్ లో ముక్కెళ్లకు వెళ్లేందుకు వారు ఆటోలో కూర్చున్నారు.అయితే బియ్యం లారీ వెన కనుంచి ఆటోను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.ప్రమాదంలో ఆటోలో కూర్చున్న వారు మృతి చెందారు.దీంతో కుటుంబసభ్యులు,బంధువులు శోకసముద్రంలో మునిగిపోయా రు.అలాగే గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.
Comments
Post a Comment