ద్విచక్ర వాహనాల దొంగల గ్యాంగ్ అరెస్ట్...పది ద్విచక్ర వాహనాలు,ఒక కెటిఎమ్ స్పోర్ట్స్ బైక్ స్వాధీనం...

ద్విచక్ర వాహనాల దొంగల గ్యాంగ్ అరెస్టు
పది ద్విచక్ర వాహనాలు ఒక కెటిఎమ్ స్పోర్ట్స్ బైక్ స్వాధీనం
దొంగలించిన వాహనాలు కొనుగోలు చేసిన తాకట్టు 
పెట్టుకున్న వారిపై కూడా కేసులు నమోదు
సీఐ వై శ్రీనివాసరావు,ఎస్సై చిరుమామిళ్ల వెంకట్

VS9TV న్యూస్,మంగళగిరి :
మంగళగిరి పోలీసు స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులను మంగళగిరి గ్రామీణ సీఐ వై.శ్రీనివాసరావు గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ లు ఛేదించారు.బుధవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బైక్ చోరీలు చేసిన నిందితుల వివరాలను గ్రామీణ సిఐవై శ్రీనివాసరావు,ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ లు వెల్లడించా రు.దొంగలించిన పది బైకులను స్వాధీనం చేసుకున్నారు.నలుగురు నిందితులు,వీరిలో మైనర్ బాలురు కూడా ఉన్నారు.వారందరినీ గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు.వీరి వద్ద నుండి స్వాధీనం చేసిన వాహనాల్లో ఒక కేటిఎమ్ స్పోర్ట్స్ బైక్ కూడా ఉండ టం విశేషం.దొంగల గ్యాంగ్‌లో ప్రధాన నిందితులు లేళ్ల పవన్ తేజ @ క్రాంతి తేజ @ పవన్,తేజావత్ ప్రకాష్,పెడల అంకమ్మరాజు @ రాజు,ఇసుకుపల్లి కీర్తి దాసు కాగా,వీరి తో పాటు తుళ్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలు రు కూడా ఉన్నారు.ప్రధాన నిందితుడు లేళ్ల పవన్ తేజ తుళ్లూరులోని టిడ్కో గృహాలలో నివసిస్తూ మిత్రులతో కలిసి దొంగతనాలు చేస్తున్నాడు.రౌడీ షీటర్‌గా గుర్తింపు పొందిన ఇసుకుపల్లి కీర్తి రాజు దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసి రిసీవర్‌గా వ్యవహ రించాడని పోలీసులు వెల్లడించారు.
ఫిర్యాదుదారు నవులూరు గ్రామానికి చెందిన మర్రి దుర్గ నాగ మల్లేశ్వరరావు ఇంటి ముం దు పార్క్ చేసిన కేటిఎమ్ బైక్‌ను ఆగస్ట్,22వ తేదీ రాత్రి దొంగలు అపహరించడంతో కేసు నమోదు అయ్యింది.విచారణలో బయటపడ్డ వివరాల ప్రకారం...నిందితులు చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోటార్ సైకిళ్లను దొంగిలించి నంబర్ ప్లేట్ మార్చి వాడుకోవడం,అమ్మేయడం లేదా తాకట్టు పెట్టడం చేసే వారని తెలిసింది.మంగళగిరి మండలంలోని ఆత్మకూరు,నవులూరు,నిడమర్రు,చినకాకా ని,ఎర్రబాలెం గ్రామాల్లో తాళం వేసి ఉన్న వాహనాలను ఎంచుకొని దొంగతనం చేసిన ట్లు దర్యాప్తులో తేలింది.దొంగలించిన వాహనాలను కొనుగోలు చేసిన వారు,తాకట్టు పె ట్టుకున్న వారిపైనా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సిఐవై శ్రీనివాసరా వు,ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ లు స్పష్టం చేశారు.ఈ కేసు దర్యాప్తులో మంగళగిరి రూ రల్ హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు,ఏఎస్‌ఐ రత్నరాజు,హెడ్ కానిస్టేబుళ్లు రాము,చల మురావు,కానిస్టేబుల్ సాగర్ లు ధర్యాప్తులో పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...