ఏసీబీకి చిక్కిన మరో అవినీతి మింగళం...
ఏసీబీకి చిక్కిన మరో అవినీతి మింగళంరైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగి
ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసిన కూడా కొందరు ప్రభుత్వ అదికారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి పెరిగిపోతూనే ఉంది.ప్రతి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఒకరు ఇద్దరు అవినీతి అధికారులు ఎసిబికి ప ట్టుపడుతూనే ఉన్నారు.అయినప్పటికీ కాసులకు కక్కుర్తి పడ్డ అవినీతి అధికారులు మాత్రం వారికి లంచం ఇవ్వందే ఏ పని కూడా చేయడం లేదు.తప్పని పరిస్థితుల్లో బాధితులు ఏ సీబీని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.వివరాలు ఇలా ఉన్నాయి...మంచిర్యాల జి ల్లా,కన్నేపల్లి ఎంపీడీవో కార్యాలయలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దుర్గప్రసాద్,ఓ రైతు వద్ద నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీకి ప ట్టుబడ్డారు.ఒకవైపు ఉదయం మేడ్చల్ టౌన్ ప్లానింగ్ అధికారి రామకృష్ణారెడ్డి ఇంట్లో ఏసీ బీ సోదాలు కొనసాగుతుండగానే,మంచిర్యాల జిల్లా,కన్నెపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఉ ద్యోగిగా పనిచేస్తున్న దుర్గప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం గమనార్హం.
Comments
Post a Comment