మొంథా తుపాను అలజడి...కాకినాడ పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ...
మొంథా తుపాను అలజడికాకినాడ పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న మోంత తుఫానునాలుగు రాష్ట్రాల్లో 25 ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపుప్రజలకు సహాయం చేయాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపుకాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫానుతమిళనాడులోనూ అప్రమత్తత,చెన్నైలో డిప్యూటీ సీఎం సమీక్ష
VS9TV న్యూస్,కాకినాడ :
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ఆంధ్రప్రదేశ్ తీరానికి మరింత చేరు వైం ది.ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టులో అత్యంత తీవ్రమైన హెచ్చరిక అయిన 10వ నంబర్ ప్రమాద సిగ్నల్‌ను అధికారులు జారీ చేశారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చ ర్యల కోసం జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. మొత్తం 25బృందాలను ఏపీ,తెలంగాణ,ఒడిశా,తమిళనాడు రాష్ట్రాలకు తరలించారు.ఎ న్డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నరేందర్ సింగ్ బుందేలా నేడు మీడియాతో మాట్లాడుతూ తుపానును ఎదుర్కొనేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.కొన్ని రో జుల క్రితమే కేబినెట్ సెక్రటరీ స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించి,నష్టాన్ని తగ్గిం చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవ కాశం ఉన్న తీర ప్రాంతాల్లో మా బృందాలను ముందస్తుగానే మోహ రించాం.తీరం దాటి న తర్వాత తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం అని వివరించారు.బంగాళాఖా తంలో తుపాను తీవ్రత పెరుగుతుండటంతో విశాఖపట్నం లోని తుపాను హెచ్చరికల కేం ద్రం తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడలో 10వ నంబర్ సిగ్నల్ ఎగుర వేయగా,విశాఖపట్నం,గంగవరం,కళింగపట్నం,భీమునిపట్నం పోర్టులలో 9వ నంబర్ ప్ర మాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు.ఈ తుపాను ప్రభావం పొరుగు రాష్ట్రమైన తమిళ నాడుపైనా ఉండవచ్చన్న అంచనాలతో అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.చెన్నైలో ని రిపన్ బిల్డింగ్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించి,సన్నద్ధతను పరిశీలించారు.
Comments
Post a Comment