20క్వింటాళ్ళు పిడిఎస్ బియ్యం పట్టివేత...
20క్వింటాళ్ళు పిడిఎస్ బియ్యం పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కరకగూడెం,మండలంలో అక్రమంగా 20క్వింటాళ్ళు రేషన్ బి య్యాన్ని రవాణా చేస్తుండగా సివిల్ సప్లై అధికారి శివకుమార్,ఎస్సై నాగేశ్వరరావు పట్టు కున్నారు.ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూ...కరకగూడెం మండలం లో ని చిరుమల గ్రామంలో 20కింటల రేషన్ బియ్యం పౌల్ట్రీ ఫారానికి రవాణా చేస్తున్నారని సమాచారం తెలవడంతో ఆ ప్రాంతానికి చేరుకొని ట్రాక్టర్లు ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని అన్నారు.రవాణా చేస్తున్న వారిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు.
Comments
Post a Comment