ఈ నెల 27 నుండి నవంబర్,2వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహనా కార్యక్రమాలు...

ఈ నెల 27 నుండి నవంబర్,2వ తేదీ వరకు 
విజిలెన్స్ అవగాహనా కార్యక్రమాలు
అవతార్ సింగ్,ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 
కర్నూలు డివిజనల్ కార్యాలయం డివిజనల్ మేనేజర్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి ప్రేరణతో,ఆయన నిజాయితీ, దేశభక్తి స్ఫూర్తి తో,ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్నూలు డివిజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో శుక్ర వారం విజిలెన్స్ అవేర్‌నెస్ వాక్‌థాన్ కార్యక్రమం  నిర్వహించారు.ఈ సందర్బంగా డివిజ నల్ మేనేజర్ అవతార్ సింగ్ మాట్లాడుతూ ఈ నెల 27 నుండి నవంబర్,2వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహనా కార్యక్రమాలు జరుపుతున్నట్లు చెప్పారు.సత్యనిష్ఠే నిజమైన దేశభ క్తి అని పేర్కొన్నారు.నిజమైన విజిలెన్స్ వ్యక్తి అంతర్గత అవగాహనతో ప్రారంభమై సమా జానికి వ్యాపించాల్సినదని వివరించారు.విజిలెన్స్ అనేది వ్యక్తి,కుటుంబం,సమాజం,ప్ర కృతి అనే నాలుగు స్థాయిలను కలిపే అఖండ శృంఖలం అన్నారు.వ్యక్తి స్థాయిలో విజి లె న్స్ తగ్గితే నైతిక విలువలు బలహీనమవుతాయి.కుటుంబ స్థాయిలో అవినీతి సహజమ వుతుంది.సమాజ స్థాయిలో అవినీతి సాధారణమై పారదర్శకత తగ్గుతుంది.చివరికి ప్రకృ తి స్థాయిలో వనరుల దుర్వినియోగం వల్ల సమతుల్యత దెబ్బతింటుందన్నారు.ఫలితంగా మళ్లీ వ్యక్తి స్థాయిలోనే దాని ప్రతికూల ప్రభావం కనబడుతుంది.అయితే విజిలెన్స్ నిబద్ధత తో పాటిస్తే నిజాయితీ గల వ్యక్తి ధైర్యాన్ని పెంచుతాడు,విలువలతో కూడిన కుటుంబం ఎదుగుతుందని చెప్పారు.విజిలెన్స్ ఆఫీసర్ వి.అనిల్,మేనేజర్లు రఘునాథ్,లక్ష్మీనారాయ ణ,సిబ్బంది కామేశ్వరరావు,పవన్ కుమార్,స్పందన,రఘునాయక్ లు మాట్లాడుతూ అధికా రుల సమన్వయంతో విజయవంతంగా జరిగిందన్నారు.వారి ఉత్సాహ భరిత పాల్గొనడం ఐక్యత,అప్రమత్తత,నిజాయితీ వంటి విలువలను ప్రతిబింబించినట్లు కొనియాడారు. అం దువల్ల విజిలెన్స్ అనేది నిరంతర బాధ్యతా వలయం.ఒక స్థాయి బలంగా ఉంటే మిగిలిన స్థాయిలన్నీ అభివృద్ధి చెందుతాయి.ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,కర్నూలు డివిజనల్ కార్యాలయం ఈ సందర్భంలో తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈ నినాదాలతో ముం దుకు సాగిందన్నారు.విజిలెన్స్ త్రూ ఇంటెగ్రిటీ–ఇన్‌స్పైర్డ్ బై సర్దార్ వల్లభభాయ్ పటేల్, అప్రమత్తత,నిజాయితీ,ఐక్యత మన బలం,మన బాధ్యత అని వారు తెలియచేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...