ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్...ట్రావెల్స్ బస్సులపై 289 కేసులు...
ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ట్రావెల్స్ బస్సులపై 289కేసులు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది.రవా ణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై వి స్తృత తనిఖీలు చేశారు.నిబంధనలు ఉల్లంఘిం చిన ట్రావెల్ బస్సులపై 289కేసులు న మోదు చేశారు.18ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి రూ.7.08లక్షల జరిమానాలు విధించారు.అత్యధికంగా ఏలూరులో 55కేసులు నమోదు చేశారు.మూడు ట్రావెల్స్ బ స్సులు సీజ్ చేశారు.తూర్పుగోదావరి జిల్లాలో 17కేసులు నమోదు చేసి...4 బస్సులు సీ జ్ చేశారు.కోనసీమ జిల్లాలో 27,చిత్తూరు జిల్లాలో 22,కర్నూలు జిల్లాలో 12,విశాఖ లో 7,నంద్యాలలో నాలుగు కేసులు నమోదు చేశారు.సరైన ధ్రువపత్రాలులేవని ఎనిమిది బస్సులు,అత్యవసర ద్వారం లేదని 13బస్సులపై కేసులు ఫైల్ చేశారు.అగ్నిమాపక ప రికరాలు లేవని 103 బస్సులపై, ప్యాసింజర్ లిస్టు లేని కారణంగా 34 బస్సులపై,ఇత ర ఉల్లంఘనలపై 127కేసులు నమోదు చేశారు.ప్రత్యేక డ్రైవ్ రోజూ కొనసాగుతుందని అ ధికారులు తెలిపారు.
Comments
Post a Comment