స్టేడియం రోడ్డులో ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు లక్కీ డ్రా...39 స్టాల్స్ వ్యాపారులకు కేటాయింపు...

స్టేడియం రోడ్డులో ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు లక్కీ డ్రా
39 స్టాల్స్ వ్యాపారులకు కేటాయింపు
60 స్టాల్స్ ఏర్పాటుకు ప్రణాళిక
700 అడుగుల వెడల్పు రహదారిపై నిర్వహణ 

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలోని స్టేడియం రోడ్డులో ప్రజల సౌకర్యార్థం ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయను న్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.దీనికి సంబంధించి స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో బుధవారం లక్కి డ్రా ని ర్వహించారు.60షాపుల నిర్వహణకు ప్రణాళికలో రూపొందించారు.అందులో 39షా పులను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...నగర అభివృద్ధిలో భాగంగా ప్రజల విహారానికి,చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాల కల్పనకు ఈట్ స్ట్రీట్ కీలకంగా నిలుస్తుందని చెప్పారు.700అడుగుల వెడల్పు రహదారిపై ఈట్ స్ట్రీ ట్‌ను ఏర్పాటు చేస్తూ,ఒక్కో స్టాల్‌ను 120 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నట్లు వి వరించారు.వ్యాపారులకు పారదర్శకంగా షాపులు కేటాయించేందుకు ఈ విధానాన్ని అ నుసరించినట్లు తెలిపారు.ఈట్ స్ట్రీట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే నగర సౌందర్యం మరింత పెరుగుతుందని,పౌరులు మరియు పర్యాటకులు ఆకర్షితులవుతారని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ,డిప్యూటీ కమిషనర్ స తీష్ కుమార్ రెడ్డి,మున్సిపల్ ఇంజనీర్ మనోహర్ రెడ్డి,మేనేజర్ చిన్నరాముడు,సూపరిం టెండెంట్ సుబ్బన్న,పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష,సిఎం ఎం భాస్కర్ రెడ్డి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...