మావోయిస్టుల ఫండింగ్ గుట్టురట్టు...రూ.400 కోట్ల నిధులు,400కిలోల బంగారం...

మావోయిస్టుల ఫండింగ్ గుట్టురట్టు
రూ.400 కోట్ల నిధులు,400కిలోల బంగారం
ఆపరేషన్ కగార్‌తో లొంగుబాట పడుతున్న మావోయిస్టులు
వందల కోట్ల పార్టీ ఫండ్‌ను బంగారంగా మార్చినట్లు అనుమానం
డొల్ల కంపెనీలు,బినామీ ఖాతాలతో నిధుల మళ్లింపు
లొంగిపోయిన మావోల ద్వారా డబ్బు 
ఆచూకీపై నిఘా వర్గాల ఆరా
ప్రాణభయంతోనే లొంగుబాటు
ఆర్థిక ఇబ్బందులతో కాదంటున్న పోలీసులు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ దెబ్బకు మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అ వుతోంది.అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు పెద్ద సంఖ్యలో లొంగుబాట ప డుతుండటంతో వారి భారీ ఆర్థిక సామ్రాజ్యం గుట్టు మెల్లగా వీడుతోంది.మావోయిస్టులు వివిధ మార్గాల్లో వసూలు చేసిన వందల కోట్ల రూపాయల నగదును బంగారంగా మార్చే శారని,భారీగా బంగారు నిల్వలు దాచిపెట్టారని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తు న్నాయి.జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో అనేక విస్తుపోయే విషయాలు వె లుగులోకి వచ్చాయి.ఝార్ఖండ్,ఛత్తీస్‌గఢ్‌,తెలంగాణ,ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని కాంట్రాక్ట ర్లు,వ్యాపారుల నుంచి సేకరించిన నిధులను మావోయిస్టులు రెండు మార్గాల్లో మళ్లిస్తున్న ట్లు అధికారులు గుర్తించారు.పార్టీ సానుభూతిపరులు,వారి కుటుంబస భ్యుల పేర్లతో డొల్ల కంపెనీలు,బ్యాంకు ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయలను అందులోకి మళ్లిస్తున్నారు. మి గిలిన భారీ మొత్తాన్ని,ముఖ్యంగా కొవిడ్ సమయంలో,బంగారంగా మార్చి అడవుల్లోని డంపుల్లో లేదా సురక్షిత ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు ల వద్ద సుమారు రూ.400 కోట్ల నిధులు,400 కిలోల బంగారం నిల్వలు ఉండవచ్చని ని ఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనలు ఈ అనుమా నాలకు బలం చేకూరుస్తున్నాయి.ఝార్ఖండ్‌కు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం డియా (పీఎల్‌ఎఫ్‌ఐ) నేత దినేశ్‌ గోపే,తన భార్య బంధువుల పేరిట డొల్ల కంపెనీలు సృ ష్టించి రూ.20కోట్లకుపైగా మళ్లించి నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. అలాగే,గతంలో ఓ మావోయిస్టు నేత తన బంధువు వైద్య కళాశాల ఫీజు కోసం ఏకంగా రూ.1.13 కోట్లను బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తే లింది.అయితే,మావోయిస్టులు లొంగిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు కారణం కాదని పోలీ సు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.వారి వద్ద ఉన్న నిధులతో మరో ఐదారేళ్లు పార్టీని నడప గలరని,కానీ భద్రతా బలగాల ఆపరేషన్లతో ప్రాణభయం పెరిగిపోవడంతోనే లొంగుబాటు బాట పడుతున్నారని విశ్లేషిస్తున్నాయి.లొంగి పోయే ముందు తమ వద్ద ఉన్న డబ్బు,ఆ యుధాల లెక్కలను పార్టీకి అప్పగించి వస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులను కేంద్ర,రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు విచారిస్తూ...దాచి పెట్టిన డబ్బు, బంగారం డంపుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...