కోర్టుల్లో పేరుకుపోయిన 5.34కోట్ల కేసులు...

కోర్టుల్లో పేరుకుపోయిన 5.34కోట్ల కేసులు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
కోర్టులల్లో పరిష్కారానికి నోచుకోకుండా చాలా కేసులు పెండింగ్‌లో ఉండడంపట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని కోర్టులను కలుపు కొని మొత్తం 5.34కోట్ల కేసులు పరిష్కరించబడకుండా పెండింగ్‌లో ఉన్నాయి.ఈ కేసు లు కొత్తగా నమోదైనవి కావు,ఏళ్ల తరబడిగా కోర్టులలో పేరుకుపోయాయి.కోర్టుల్లో పేరు కుపోయిన పెండింగ్‌ కేసుల పరిస్థితిపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది.పెండింగ్‌ కేసుల స త్వర పరిష్కారం కోసం దేశవ్యాప్త అన్ని హైకోర్టులకు ఈ ఏడాది మార్చి,6న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్‌ను జారీ చేసింది.తమ పరిధిలో ఉన్న సివిల్‌ కోర్టులలోని పెండింగ్‌ కేసులను ఆ రు నెలల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది.సుప్రీంకోర్టు న్యాయమూర్తలు జస్టిస్‌ జేబీ పార్దివాలా,జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌ల ధర్మాసనం మార్చి,6న జారీచేసిన ఉత్తర్వుల అమలు ను ఇటీవల సమీక్షించింది.తాము జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత,గడిచిన ఆరు నెలలలో 3,38,685 కేసులు పరిష్కరించబడలేదని ధర్మాసన సభ్యులు గుర్తించారు.అంతే కా కుండా ఇంకా 8,82,578 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టుగా తేల్చారు.వీటితో పాటు గత నె లాఖరు వరకు సుప్రీం కోర్టులో 88,417 కేసులు పెండింగ్‌లో ఉండగా,అన్ని హైకోర్టు లలో 63.8 లక్షలు,కిందిస్థాయి కోర్టుల్లో 4.7కోట్లు కలిపి ప్రస్తుతం మొత్తం 5.34కోట్ల కే సులు పెడింగ్‌లో ఉన్నట్టుగా తాజా సమాచారం తెలియజేస్తోంది.ఇందులో అనేక కేసులు అసలు ఇంతవ రకు ధర్మాసనం ముందుకు రాలేదు.విచారణకు నోచుకోలేదు.వీటిలో కొ న్ని కేసులు దశాబ్ధాల తరబడిగా పెండింగ్‌లో ఉన్నాయి.బెర్హంపూర్‌ బ్యాంకు కేసు 195 2 నుంచి కోల్‌కతా హైకోర్టులో అలానే మూలుగుతోంది.ఇక తెలంగాణలో పరిస్థితి చూ స్తే...పార్టమెంటుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సమర్పంచిన డేటా ప్రకారం-2025, ఏప్రిల్‌,7వరకు తెలంగాణ హైకోర్టు,జిల్లా,క్రిందిస్థాయి కోర్టులను కలుపుకొని మొత్తం 11. 82 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.ఏళ్ల తరబడిగా పెండంగ్‌లో ఉండటానికి కారణ మేంటి? 143 కోట్ల జనాభా గల భారతదేశంలో ప్రజల మధ్య తరచూ ఏదో ఒక వివాదం చోటుచేసుకోవడం సహజం.దీనికి అనేక కారణాలుంటాయి.ఈ వివాదాలను తొందరగా పరిష్కరించడానికి కావల్సిన కోర్టులు భారతదేశంలో ఉన్నాయా? అవసరానికి తగ్గట్టుగా జడ్జిలున్నారా అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.మానవ వనరుల సంక్షోభం తో దేశ న్యాయస్థానాలు కొట్టుమిట్టాడుతున్నాయి.“నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్(ఎన్జే డీజీ), డిపార్టుమెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌”ప్రకారం-సెప్టంబరు,1నాటికి సుప్రీంకోర్టుతో పాటు సి క్కిం,మేఘాలయ హైకోర్టులు మాత్రమే పూర్తి స్థాయి బెంచ్‌లతో పని చేస్తున్నాయి.ప్రస్తు తం 25 రాష్ట్రాలలో 330జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి.అందులో అలహాబాద్‌ హైకో ర్టు పరిస్థితి మరీ దారుణంగా ఉంది.ఈ కోర్టులో 160 పోస్టులు మంజూరు కాగా 76పో స్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి.మరోపక్క దేశవ్యాప్త అన్ని హైకోర్టులకు 1,122జడ్జిల పోస్టులు మంజూరు కాగా, అందులోంచి 792 పోస్టులను భర్తీ అయ్యాయి.మిగితా 330 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.ఇందులో 161 శాశ్వత పోస్టులు,మిగితావి 169 అదనపు జడ్జిల పోస్టులున్నాయి.రాష్ట్రాల వారిగా మంజూరైన పోస్టులకు భిన్నంగా అతిత క్కువ జడ్జీలతో పని చేస్తున్న హైకోర్టులు...ఆంధ్రప్రదేశ్‌-7,ముంబాయి-26,ఛతీస్‌ఘడ్‌- 7,ఢీల్లీ-16,గౌహతీ-5,గుజరాత్‌-13,హిమాచల్‌ప్రదేశ్‌-6,జమ్మూకశ్మీర్‌ లద్దాఖ్‌-10,జా ర్ఖండ్‌-10, కర్నాటక-16,కేరళ-4,మధ్యప్రదేశ్‌10,మద్రాస్‌-19,ఒరిస్సా-13,పాట్నా-18 ,పంజాబ్‌ హర్యానా-25,రాజస్థాన్‌-7,తెలంగాణ-13,మణిపూర్‌-2,ఉత్తరాఖండ్‌-2,త్రిపు రా-1 జడ్జి మాత్రమే ఉన్నారు.దేశంలో న్యాయస్థానాల పెండింగ్‌ కేసుల పరిస్థితి ఇది.న్యా యమూర్తులు,కోర్టు సిబ్బందిలేమితో పనిచేస్తున్న న్యాయస్థానాల నుంచి సత్వర న్యాయా న్ని ఆశించడం కూడా పెద్దనేరంగా భావించే రోజులు రానున్నాయా?.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...