మొంథా ఎఫెక్ట్...సముద్రంలో చిక్కుకున్న 600మందిని కాపాడిన అధికారులు...

మొంథా ఎఫెక్ట్...
సముద్రంలో చిక్కుకున్న 600మందిని కాపాడిన అధికారులు

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
‘మొంథా’ తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్ర దేశ్‌కు చెందిన సుమారు 600మంది మత్స్యకారులను స్థానిక అధికారులు సురక్షితంగా కాపాడారు.భారీ వర్షాల కారణంగా ముందుకు కదల లేకపోయిన 60ట్రాలర్లను ఒడిశా యం త్రాంగం గోపాల్‌పుర్‌ ఓడరేవుకు తరలించింది.వివరాల్లోకి వెళితే...మొంథా తుపా ను కారణంగా ఒడిశాలోని గంజాం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నే పథ్యంలో చేపల వేటకు వెళ్లిన ఏపీకి చెందిన మత్స్యకారులు ఛత్రపురం సమీపంలోని అ ర్జిపల్లి వద్ద సముద్రంలో చిక్కుకుపోయారు.విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.మొత్తం 60ట్రాలర్లను గోపాల్‌పుర్‌ ఓడరేవులో లంగర్లు వేసేందుకు ఏర్పాట్లు చేసింది.ఈ వివరాలను మత్స్యశాఖ ఉపసం చాలకులు సంగ్రామ్ కర్‌ విలేకరులకు వెల్లడించారు.మొత్తం 600మందినీ సురక్షితంగా ఒ డ్డుకు చేర్చామని,వారికి అవసరమైన ఆహారం,తాగునీరు,ఔషధాలు అందించామని ఆయ న తెలిపారు.తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులకు అన్ని విధాలా అండ గా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ ఘటనపై గంజాం జిల్లా కలెక్టర్ కీర్తివాసన్ కూడా స్పం దించి,సహాయక చర్యలు,పునరావాస ఏర్పాట్లపై ఆరా తీశారు.ప్రస్తుతం మత్స్యకారులం తా గోపాల్‌పుర్‌ ఓడరేవులో సురక్షితంగా ఉన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...