వీధి కుక్కల కేసులో చీఫ్ సెక్రటరీలు ఫిజికల్ గా హాజరుకావాల్సిందే...

వీధి కుక్కల కేసులో చీఫ్ సెక్రటరీలు ఫిజికల్ గా 

హాజరు కావాల్సిందే

VS9RV న్యూస్, హైదరాబాద్ :
దేశ వ్యాప్తంగా నెలకొన్న కుక్కల బెడదపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది.ఇటీ వల కుక్కల సమస్యపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయంగా భా రతదేశ గౌరవం డ్యామేజ్ అవుతున్నా మేలుకోరా? అంటూ వ్యాఖ్యానించింది.తాజాగా ఇదే అంశంపై న్యాయ స్థానం...చీఫ్ సెక్రటరీ లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.చీఫ్ సెక్ర టరీలు సోమవారం ధర్మాసనం ముందు ఫిజికల్‌ గా హాజరు కావాల్సిందేనని సూచించిం ది.ఒకవేళ వ్యక్తిగతంగా హాజరుకాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.వీధి కుక్కల కేసు విచార ణకు తెలంగాణ,ఢిల్లీ,పశ్చిమ బెంగాల్ మినహా ఇతర రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీ‌లు ఎందుకు హాజరు కావడం లేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది.ఈ సందర్భం గా రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఫిజికల్‌గా హాజరు కావాల్సిందేనం టూ నోటీసులు జారీ చేసింది.అయితే వర్చువల్‌గా కోర్టు ముందు హాజరయ్యేందుకు అను మతి ఇవ్వాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.సొలిసిటర్ జనరల్ తు షార్ మెహతా చేసిన విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.తుషార్ మెహతా అభ్య ర్థనను జస్టిస్ విక్రమ్ నాథ్,సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. కచ్చితంగా సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరుకా వాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది.ఇది చాలా దురదృష్టకరం...మునిసిపల్ కార్పొరేషన్లు,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్క రించాల్సిన సమస్యలతో కోర్టు సమయం వృథా అవుతోందని న్యాయస్థానం ఆవేదన వ్య క్తం చేసింది.పార్లమెంట్ నిబంధనలు చేస్తుంది.కానీ ఎటువంటి చర్యలు ఉండవు.మేము కంప్లయన్స్ అఫిడవిట్లు ఫైల్ చేయమని ఆదేశిస్తే...వారు దానిని పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాలకు గౌరవం లేదు.వాళ్లు భౌతికం గా వచ్చి ఎందుకు కంప్లయన్స్ అఫిడ విట్లు దాఖలు చేయలేదో చెప్పాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది.ఇక విధి కుక్కల కేసులో యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అమలుపై కోర్టు ఇచ్చిన గడువులోగా తెలంగాణ,పశ్చిమ బెంగాల్,ఢిల్లీ అఫిడవిట్ దాఖలు చేశాయి. మిగతా రాష్ట్రాలు చేయకపోవడంపై తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...