అమెరికా విమానంలో భారత విద్యార్థి వీరంగం...ఇద్దరు టీనేజర్లపై మెటల్ ఫోర్క్‌తో దాడి...

అమెరికా విమానంలో భారత విద్యార్థి వీరంగం
ఇద్దరు టీనేజర్లపై మెటల్ ఫోర్క్‌తో దాడి

VS9TV న్యూస్,హైదరాబాద్ :
అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి విమానంలో వీరంగం సృష్టించాడు.వీసా స్టేటస్ కోల్పో యాడన్న కారణంతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులపై దాడికి పాల్ప డ్డాడు.చికాగో నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచే సుకుంది.దీంతో విమానాన్ని అత్యవసరంగా బోస్టన్‌కు మళ్లించి,నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి (28) అనే భారత విద్యార్థి విమానంలో భోజనం సరఫరా చేసిన తర్వాత ఒక్కసారిగా హింసాత్మకంగా ప్రవర్తిం చా డు.తన చేతిలో ఉన్న మెటల్ ఫోర్క్‌తో 17ఏళ్ల బాలుడి భుజంపై,మరో 17ఏళ్ల బాలుడి తల వెనుక భాగంలో పొడిచాడు.అంతేకాకుండా ఓ మహిళను చెంపదెబ్బ కొట్టి,విమాన సిబ్బందిపై కూడా దాడికి యత్నించినట్లు బోస్టన్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్ లియా ఫోలీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.విమాన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునేం దుకు ప్రయత్నించగా,ప్రణీత్ తన వేళ్లతో తుపాకీ ఆకారాన్ని చేసి,దాన్ని నోట్లో పెట్టుకుని కాల్చుకున్నట్లుగా అభినయించాడని ప్రాసిక్యూటర్ కార్యాలయం వివరించింది.ఈ ఘటన తో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే బోస్టన్‌లోని లోగాన్ అంతర్జాతీయ విమా నాశ్రయానికి మళ్లిం చారు.అక్కడ ఫెడరల్ అధికారులు ప్రణీత్‌ను అదుపులోకి తీసుకున్నా రు.స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చిన ప్రణీత్,ప్రస్తుతం చట్టబద్ధమైన వీసా స్టేటస్‌ను కో ల్పోయినట్లు అధికారులు తెలిపారు.అతను బైబిల్ స్టడీస్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో చేరినట్లు తెలిసింది.అతని లింక్డ్‌ ఇన్ ప్రొఫైల్ ప్రకారం,అతను చికాగోలోని మూడీ బైబిల్ ఇన్‌స్టి ట్యూట్‌లో విద్యార్థిగా ఉన్నాడు.ప్రణీత్‌పై ప్రమాదకరమైన ఆయుధంతో విమానంలో దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.నేరం రుజువైతే అతనికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు 2,50,000డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్ కా ర్యాలయం పేర్కొంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...