భారత్ పరువు తీస్తున్నారు...వీధి కుక్కల కేసులో రాష్ట్రాలు,యూటీలపై సుప్రీం కోర్టు ఆ‍గ్రహం...

భారత్ పరువు తీస్తున్నారు
వీధి కుక్కల కేసులో రాష్ట్రాలు,
యూటీలపై సుప్రీం కోర్టు ఆ‍గ్రహం

VS9TV న్యూస్,న్యూఢిల్లీ :
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైన రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.వీధి కుక్కల నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు స్పందించలేదంటూ ఆయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది.తమ ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్లు సమర్పించ డంలో విఫలమైనందుకు పశ్చిమ బెంగాల్,ఢిల్లీ,తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల ప్రధాన కా ర్యదర్శులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణ 2025,నవంబర్,3న అధికారులు సుప్రీంకోర్టు ముందు స్వయంగా విచారణకు హాజరుకా వాలని ఆదేశించింది.అధికారులు హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరించింది.వీధి కుక్కల నియంత్రణలో విఫలమై ప్రపంచదేశాల ముందు భారత్ పరువు తీస్తున్నారంటూ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా,వీధి కుక్కలకు సంబంధించి 'ఇన్ ఎ సిటీ హండెడ్ బై స్ట్రేస్,కిడ్స్ పే ప్రైస్' అ నే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచా రణకు స్వీకరించింది.ఈ మేరకు 2025,ఆగస్టు 22న అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాం తాలు జంతు జనన నియంత్రణ నిబంధనల ప్రకారం వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ క్రమంలో 2025,అక్టోబర్,27న ఈ పిటిషన్‎పై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్,సందీప్ మెహతా,ఎ న్.వి.అంజరి యాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.అయితే...వీధికు క్కల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి మెజార్టీ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతా లు అఫిడవిట్లు సమర్పించలేదు.పశ్చిమ బెంగాల్,తెలంగాణ,ఢిల్లీ మాత్రమే అఫిడవిట్ దాఖ లు చేశాయి.దీంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్లు సమర్పించడంలో విఫల మైన రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.తమ ఉత్తర్వులను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని...తద్వారా అంతర్జాతీ య స్థాయిలో దేశం పరువు తీశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.రెండు నెలలు గడిచినా స్పందన లేదని...అంటే దీని అర్థం ఏంటని ప్రశ్నించింది.తమ ఆదేశాల తర్వాత కూడా దే శవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయని,వీధి కుక్కల దాడులపై రోజూ మీడియాలో వార్తలు వస్తున్నా...అవి అధికారులకు కనిపించడం లేదా అ ని ప్రశ్నించింది.మన దేశాన్ని విదేశీయులు కించపరిచేలా మాట్లాడటానికి...కుక్కల బెడ ద కూడా కారణమని వ్యాఖ్యానించింది.అనంతరం పశ్చిమ బెంగాల్,ఢిల్లీ,తెలంగాణ మిన హా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సమన్లు జారీ చే సింది.ఈ మేరకు తదుపరి విచారణ 2025,నవంబర్,3న అధికారులు సుప్రీంకోర్టు ముం దు స్వయంగా విచారణ కు హాజరుకావాలని ఆదేశించింది.అధికారులు హాజరుకాకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...