తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్...

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో 

సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

VS9TV న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణలో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లో ఉండవలసిందే రిపోర్టు ఇవ్వకుండా ని ర్లక్ష్యం వహిస్తే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశా రు.మొంథా తుఫాన్‌ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి గురువుగారు ఆయా జిల్లాల కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వా తావరణ శాఖ హెచ్చరించింది.ఈ క్రమంలో ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఇది వరి కోతల కాలం...అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోందన్నారు.అధికారులు అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు.అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్య టించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.ఈదురు గాలులతో విద్యుత్ అంతరా యం కలగగుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రో డ్లపై బ్రిడ్జిలు,లో లెవల్ కాజ్ వేల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలన్నా రు.ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి.అవసరమైనచో ట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వరంగల్ లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను విని యోగించుకోవాలన్నారు.24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి.అధికా రులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్ర మత్తం చేయాలన్నారు.జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇం చార్జ్ మంత్రికి తెలపాలన్నారు.వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అ ప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు.ప్రాజెక్టుల ఇన్ ఫ్లో,అ వుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.ప్రాణనష్టం,పశునష్టం,పంటనష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదన్నా రు.వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసు కున్నానన్న రేవంత్ రెడ్డి రేపు వరంగల్,హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వ హిస్తానన్నారు.తుఫాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు.క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.ప్రజలను ఆదుకు నేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్య మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....