అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్స్ ను ప్రారంభం...ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలి...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్స్ ను ప్రారంభం
ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలి
విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
ట్రాఫిక్ క్రమబద్దీకరణకు,రహదారి భద్రత నిబంధనలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నామని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.శుక్రవారం కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ని ర్వహించిన అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్ పరికరాలను కర్నూలు స్థానిక కొం డారెడ్డి బురుజు వద్ద కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు.ఈ సంధర్బం గా విలేకరులతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...కర్నూలు ట్రాఫిక్ పోలీసు లు వినూత్నమైన కార్యక్రమం చేపట్టారన్నారు.
ప్రజలకు,విద్యార్దులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకు న్నామన్నారు.విద్యార్దులు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయకుండా అవగాహన కల్పించేందుకు ఒక ట్రాఫిక్ నమూనాను ఏర్పాటు చేశామన్నారు.జాతీయ రహాదారులలో రోడ్డు ప్రమా దాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ నమూనాను కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఆవిష్కరించామన్నారు.ఈ ట్రాఫిక్ నమూనాను విద్యాసంస్థల వద్దకు తీసుకువెళ్ళి లైవ్ డెమో ఇచ్చి రహదారి నిబంధనలపై విద్యార్థులకు అవగాహన క ల్పిస్తామన్నారు.రాంగ్ పార్కింగ్,సిగ్నల్ జంపింగ్ వంటివి చేయకుండా ఎలా ఉండాలి అనే విషయంపై ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తామన్నారు.సామాజిక భాద్యత కలి గిన (జెమ్ కేర్ కామినేని హాస్పిటల్,కిమ్స్ హాస్పిటల్,బాలాజీ ఆయిల్స్,వస్త్రాలయ షా పింగ్ మాల్) దాతల సహాకారంతో ట్రాఫిక్ నియంత్రణకు 80బారికేడ్స్ ను అందించార న్నారు.
వారికి ధన్యవాధాలు తెలియజేస్తున్నామన్నారు.రాబోయే రోజుల్లో కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహాకరించాలన్నారు.ముందుగా ట్రాఫిక్ పోలీసులు,షో రూమ్ ల యువకులు కలిసి హెల్మెట్ పై అవగాహనకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్,సిఐలు మన్సురుద్దీన్,కిమ్స్ హాస్పిటల్ సిఓఓ డా.సునీల్ కుమార్,జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ సిఈఓ డా.చంద్రశేఖర్, బాలా జీ ఆయిల్స్ అధినేత షరఫ్ సత్యదేవ,వస్త్రాలయ షాపింగ్ మాల్ అధినేత వేణుగోపాల్ రె డ్డి,ఆర్ ఎస్సైలు కర్నూలు ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...