వార్డులలో రోడ్లు,డ్రైన్లు,వీధిలైట్లు, మరుగుదొడ్ల స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలి... ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కు సిపిఎం వినతి అందచేత...

వార్డులలో రోడ్లు,డ్రైన్లు,వీధిలైట్లు,మరుగుదొడ్లు, 
స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 
కమిషనర్ కు సిపిఎం వినతి అందచేత

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ కి వార్డులలో ఉన్న సమస్య ల పరిష్కరించాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగ ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు బి.కే.రామకృష్ణ,కల్లూరు కార్యదర్శి జె.శ్రీనివాసులు మాట్లాడుతూ 32వవార్డులో హంద్రీనది వెంట ముజఫర్ నగ ర్,ఐఎంఎల్ డిపో నుండి కల్లూరు హంద్రీ బ్రిడ్జి వరకు మురికి కాలువ నిర్మించాలని,సిసి రోడ్లు వేయాలని,అలాగే గంగావతి నగర్ లో ఉన్న మహిళల మరుగుదొడ్డి ఈ మధ్యకా లంలో వచ్చిన హంద్రీ నదికి వచ్చిన వరద వల్ల మొత్తం కూలిపోయిందని అన్నారు.ఆ సా మూహిక మరుగుదొడ్డిని రిపేరు చేయాలని,అక్కడ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.33వ వార్డులో స్మశాన వాటిక పూర్తిగా కంపచెట్లతో నిండి చనిపోయిన శవాలను ఎక్కడ దహనం చేయాలో తెలియని పరిస్థితి ఉందని,స్మశాన వాటికలో వెంట నే కంప చెట్లు తొలగించి,కాంపౌండ్ వాల్ నిర్మించి,వీధిలైట్లు వేయాలని కోరారు.అలాగే కల్లూరు ఊర వాకిలి దగ్గర త్యాగరాజ స్వామి గుడి నుండి దేవనగర్ వరకు హంద్రీ కాజు వే పై ఐమాక్స్ లైట్లు వేయాలన్నారు.35వ వార్డులో ఫారుక్ నగర్,ఉమామహేశ్వరి నగర్ లో రోడ్లు కాలువలులేని కారణంగా వర్షం వచ్చిందంటే రోడ్లు బురదమయంగా మారి,ఇళ్ల ల్లోకి వెళ్లే పరిస్థితి లేదని అందుకు ఫరూక్ నగర్,ఉమామహేశ్వరి నగర్ లో సిసి రోడ్లు కా లువలు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం కమిషనర్ పి.విశ్వనాధ్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఇచ్చిన అర్జీలను పరిశీలించి,సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్క రించాలని ఆదేశాలు జారీ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...