కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభు త్వం సుముఖం...నగరపాలక అధికారుల సమీక్షలో మంత్రి టీజీ భరత్...

నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదాం
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖం
 బి,సి క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేలా సిఎంతో చర్చలు
 స్మార్ట్ సిటీ పనులకు సైతం వినియోగం
మెడికల్ కాలేజీ షాపులపై కోర్టు తీర్పు అమలు
నగరపాలక అధికారుల సమీక్షలో మంత్రి టీజీ భరత్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ,అగ్రగామిగా నిలుపుతామని రాష్ట్ర పరిశ్ర మలు,వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.బుధవారం స్థానిక ఎ స్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో కమిషనర్ పి.విశ్వ నాథ్‌తో కలిసి అన్ని విభాగాల అధికారులు,అమినిటీస్ కార్యదర్శులు,కాంట్రాక్టర్లతో సమా వేశం నిర్వహించారు.ముందుగా నగరంలో రూ.12.62కోట్లతో జరుగుతున్న 62 అభి వృద్ధి పనులపై కాంట్రాక్టర్ల వారీగా సమీక్ష నిర్వహించారు.జాప్యం జరుగుతున్న పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసు కోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క ర్నూలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రగతిలో ముఖ్య స్థానాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టు కుందని పేర్కొన్నారు.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సుముఖంగా ఉందని,దీన్ని నగర శివార్లలో కాకుండా బి,సి.క్యాంపుల్లో ఏర్పాటు చేసే అంశంపై ఇటీవల విదేశీ పర్య టనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు వెల్లడించారు.ముఖ్యమంత్రి సైతం దీనిపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. 160ఎకరాలకుపైగా భూమి ఉందని, ఎకరా 100కోట్ల వరకు విలువ ఉందని,దీన్ని సమర్థవంతంగా వినియోగించుకుం టా మని అన్నారు.వాటిలోనే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు స్థలం కేటాయించేందుకు చర్యలు తీసు కుంటున్నట్లు వివరించారు.
బుధవారపేట మెడికల్ కాలేజీ మలుపు వద్ద ఉన్న షాపుల అంశం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు నడుచుకుంటా మని తెలిపారు.అనంతరం రహదారుల విస్తరణ,పారిశు ద్ధ్యం,టిడ్కో గృహాలు,గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతి తదితర అంశాలపై నగరపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,మేనేజర్ చిన్నరాము డు,ఇన్‌చార్జ్ ఎస్‌ఇ శేషసాయి,ఆర్ఓలు జునైద్,స్వర్ణలత,వాజిద్, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు,ఎంఈ మనోహర్ రెడ్డి,పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష,తది తరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....