గొందిపర్ల చిప్పరౌస్ కాలనీవాసులకు పట్టాలు ఇవ్వాలి...తాండ్రపాడులో ఇచ్చిన పట్టాలకు స్థలం చూపించాలి..ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా...

గొందిపర్ల చిప్పరౌస్ కాలనీవాసులకు పట్టాలు ఇవ్వాలి
తాండ్రపాడులో ఇచ్చిన పట్టాలకు స్థలం చూపించాలి 
ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కర్నూలు మండలం,గొందిపర్ల గ్రామపంచాయతీ పరిధిలో చిప్పరౌస్ కాలనీలో 42సంవ త్సరాల నుండి నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని,ఈ తాండ్రపాడులో 2009 సంవ త్సరంలో వరదలు వచ్చిన సందర్భంగా ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపించాలని,లేని ప క్షంలో ఆర్డిఓ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు జీ.రామకృష్ణ హెచ్చరించారు.సోమవారం కర్నూలు ఆర్డిఓ కార్యాలయం ముందు తాండ్రపాడు,గొందిపర్ల గ్రామాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి గొందిపర్ల సిపిఎం పార్టీ నాయకులు శ్రీరాములు అధ్యక్షతన ధర్నా చేశారు.ఈ సందర్బం గా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ,సిపిఎం పార్టీ మండల కార్య దర్శి హుస్సేనయ్య,రాఘవేంద్ర,ఈ.తాండ్రపాడు సర్పంచ్ బాలపీర,గొందిపర్ల మాజీ స ర్పంచ్ జి.ఆంజనేయులు మాట్లాడారు.42 సంవత్సరాల నుండి పేదల నివసిస్తున్న కాలనీ కి ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకపోవడం శోచనీయమని,ఇదేనా పేదల ప్రభుత్వం అని నిల దీశారు.గొందిపర్ల చిప్పరౌస్ కాలనీలో నివసిస్తున్న వారు అత్యంత పేదలని అడ్డా కూలీలు ఇండ్లలో పాచి పనులు చేసి జీవించే వారికి పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని ఆ యన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం నివసిస్తున్న గుడిసెలకు కరెంటు,ఆధార్ కార్డు,రేష న్ కార్డు ప్రభుత్వం మంజూరు చేసిందని,వీటితో పాటు పట్టాలు ఇవ్వాలని పలుమార్లు అధి కారులు దృష్టికి తీసుకువచ్చిన ఫలితం లేక నేడు ఆర్డీవో కార్యాలయంలో నిరసన ధర్నా చే యడం జరిగిందని తెలిపారు.తేళ్లు,పాములు సంచరిస్తున్నప్పటికీ మరో మార్గం లేక అ క్కడే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారని,ఇంతటి దరిద్రం అనుభవిస్తున్న వారికి ప్ర భుత్వం తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.నారా లోకేష్ ఎన్నికల ముందు సొంత ఇంటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చాడని,ఆ హామీని ఇక్కడ అమలు చే యాలని కోరారు.అదేవిధంగా ఈ తాండ్రపాడు గ్రామంలో 2009 వరదలు వచ్చిన సంద ర్భంగా గ్రామమంతా కూడా నీటిలో మునిగిపోయిందని,ఆ సందర్భంగా నాడు ఉన్న ప్రభు త్వం వేరే స్థలంలో ఇల్లు కట్టి ఇస్తామని సుమారు 2000మందికి పట్టాలు మంజూరు చేసి 16సంవత్సరాల అయినప్పటికీ,వాటి ఊసే ఎత్తకపోవడం న్యాయం కాదని,ఇప్పటికైనా ఈ తాండ్రపాడులోని పట్టాలు పొందిన వారికి అందరికీ స్థలాలు చూపించి,పట్టాలు లేని వారికి పేదలకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గొంది పర్ల కృష్ణ,మునిస్వామి దాదా పీరా,మాజీ సర్పంచ్ ఏరిదాసు,చిన్నవల్లి,బీసన్న,తాండ్రపా డు మహమ్మద్ హుస్సేన్,రామాంజనేయులు,మాజీ సర్పంచ్ గోపాలు,తాండ్రపాడు,గొం దిపర్ల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...