బాబా వేషంలో సర్కారీ టీచర్... భయాందోళనలో విద్యార్థులు...

బాబా వేషంలో సర్కారీ టీచర్ భయాందోళనలో విద్యార్థులు 

VS9TV న్యూస్, మహబూబాబాద్ :
మహబూబాబాద్ జిల్లా,కురవి మండలం,రాజోల్ గ్రామ ప్రభుత్వ హైస్కూల్‌లో విధులు ని ర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడు తన విధుల్లో ఉండే సమయంలో బాబా మాదిరిగా చం డి మాలలు,విభూతి,కమండలం,పొడవు గడ్డం,కాషాయపు వస్త్రాలు ధరించి స్కూల్‌కు రావడం స్థానికుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది.ఉపాధ్యాయుడు ప్రతిరోజూ స్కూల్‌కు అదే వేషధారణతో హాజరవుతూ,తరగతుల్లో భయం,అయోమయం కలిగిస్తున్నట్లు విద్యార్థు లు,తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొందరు పిల్లలు భయంతో పాఠశాలకు రాకుండా పోతున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి...ఉ పాధ్యాయుడు కురవి మండలం, గుండ్రాతి మడుగు స్టేషన్ గ్రామానికి చెందినవారు.అక్క డ ఆయన స్వయంగా “కామాఖ్య దేవి శక్తి పీఠం” పేరుతో దేవాలయం నిర్మించి,“దే శంలో రెండవ కామాఖ్య శక్తి పీఠం” అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు.తనను “శ్రీశ్రీ సిద్ధయోగి శివశక్తీ ప్రతాప్‌నాథ్ స్వామీజీ” అని పిలిపించుకుంటూ,మొబైల్ నంబర్‌తో క లిపి రాజకీయ విజయం,ఆరోగ్యం,వివాహం,సంతానం వంటి సమస్యలకు పరిష్కారమని ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
ఉద్యోగ సర్వీస్ రూల్స్ చట్టపరమైన కోణం :
విద్యా శాఖ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు తటస్థత,మత నిరపేక్షత, వృత్తిపరమైన ప్రవర్తన పాటించాలి.
గవర్నమెంట్ సర్వంట్స్ కండక్ట్ రూల్స్ :
1964 ప్రకారం ఉద్యోగులు మత ఆధ్యాత్మిక ప్రచారం ఎక్కడ చేయరాదు.స్కూల్ లో అ యితే విద్యార్థులలో భయం లేదా మతపరమైన ప్రభావం కలిగించే ప్రవర్తన నిషేధం.స్కూ ల్ ప్రాంగణంలో ఆధ్యాత్మిక,తాంత్రిక కార్యక్రమాలు నిర్వహించడం చట్టవిరుద్ధం అవు తుంది అనే విషయం ఈ మాస్టారుకి తెలియకపోవచ్చు.
తల్లిదండ్రుల అభ్యర్థన :
స్కూల్ విద్యార్థుల మనసులపై ప్రతికూల ప్రభావం పడుతోందని,విద్యార్థులు చదువుపై దృ ష్టి కోల్పోతున్నారని,ఇలాంటి వ్యక్తిపై జిల్లా విద్యా శాఖ చర్య తీసుకోవాలని తల్లిదండ్రులు జిల్లా విద్యాధికారిని కోరుతున్నారు.
అధికారుల స్పందించాలి :
ఈ విషయంపై జిల్లా విద్యా శాఖ,జిల్లా కలెక్టర్,జిల్లా పోలీసు అధికారులు తక్షణమే స్పం దించి,దర్యాప్తు చేపట్టి ఆ ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞ ప్తి చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...