మొంథా తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి...రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

మొంథా తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో 
కాకినాడ జిల్లా కలెక్టర్ కు దిశానిర్దేశం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకా శం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఎలాంటి పరిస్థి తులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు.కాకినాడ జి ల్లా కలెక్టర్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.కాకినాడ జిల్లాలో సముద్రతీరం ఉన్న తు ని,పిఠాపురం,కాకినాడ రూరల్,కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ విషయంపై చర్చించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తుఫా నుపై ప్రజలను అప్రమత్తం చేయండి.జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజల ను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి.తుపాను షెల్టర్లలో ఆహారం,ఔ షధాలు,పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి.వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగు ణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని సూచించారు.రెవెన్యూ,వ్యవసాయ,నీటిపా రుదల,పోలీస్,అగ్ని మాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధం గా ఉంచుకోవాలి.ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.మత్స్యకారులను అప్రమత్తం చేయండి అని స్పష్టం చేశారు.ఏలేరు రిజర్వా యర్ పరిస్థితిపై ఆరా తీశారు.రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని,నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు.వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటి కప్పుడు సమన్వయం చేసుకోవాలని,పిఠాపురం,పెద్దాపురం నియోజక వర్గాల రై తులు,ప్రజలకి సమాచారం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో కాకినాడ వె ళ్ళేందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు సిద్ధంకాగా,ఈ పరిస్థితుల్లో వద్దని సహాయక చర్యల సన్నద్ధతలో యంత్రాంగం నిమగ్నమై ఉంటుందని,ఇప్పుడు జిల్లా పర్యటన వద్దని జిల్లా క లెక్టర్ సున్నితంగా సూచించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...