సంఘటిత ఉద్యమం కొరకై పోరాటాలకు సిఐటియు సిద్ధం...ఎం.డి.అంజిబాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి...
సంఘటిత ఉద్యమం కొరకై పోరాటాలకు సిఐటియు సిద్ధంఎం.డి.అంజిబాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి
కర్నూలు జిల్లాలో సంఘటిత కార్మిక వర్గ ఉద్యమ నిర్మాణం కొరకు సిఐటియు ఆధ్వర్యం లో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు 13వ జిల్లా మహాసభలు పిలుపు ఇచ్చినట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు తెలియజేశారు. ఈనెల 25,26 తేదీలలో కర్నూలు నగరంలో కార్మిక కర్షక భవన్ నందు(కామ్రేడ్ రాజగోపాల్ ప్రాంగణం కామ్రేడ్ మహానంది రెడ్డి నగర్) నందు నిర్వహించిన మహాసభ వివరాలను కా ర్మిక కర్షక భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ,జిల్లా కోశాధికారి ఏం.గోపాల్ జిల్లా కార్యదర్శి ఆర్.నరసింహులు మాట్లాడుతూ సిఐటియు జిల్లా మహాసభలో జిల్లా వ్యా ప్తంగా వివిధ పట్టణాలకు మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 180 మంది ప్రతినిధులు పా ల్గొన్నట్లు తెలిపారు.ఈ మహాసభలకు సిఐటియు రాష్ట్ర కేంద్రం నుండి సిఐటియు రాష్ట్ర ఉ పాధ్యక్షులు,మాజీ శాసనసభ్యులు ఎం.ఏ గఫూర్,సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి.నాగే శ్వరరావులు హాజరై ప్రతినిధులు జరిపే చర్చలను పర్యవేక్షించారు.కర్నూలు జిల్లాలో గత మూడు సంవత్సరాల కాలంలో చేసిన ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తులో చేపట్ట వలసిన ఉద్యమ పోరాటాలను మహాసభలో రూపొందించుకోవడం జరిగిందని అన్నారు. జిల్లాలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలైన అంగన్వాడి ఉద్యోగుల 42 రోజుల సమ్మె,ఆశా వర్కర్ల ఆందోళనలు,మున్సిపల్ కార్మికుల 17 రోజుల సమ్మె,కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై ప ది రోజులుగా జరిగిన సమ్మెలోను జయప్రదం చేయడానికి సిఐటియు కృషి చేసిందని తె లియజేశారు.కర్నూలు నగరంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న క్లాప్ డ్రైవర్ల సమస్యలపై 42రోజులపాటు సమ్మె చేసినట్లు తెలియజేశారు.మెడికల్ రంగంలో హెల్త్ సెక్రటరీస్ గా పనిచేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్ ప్రకారం ప్రమోషన్లు కల్పిం చాలని ఆందోళనలో 175 మందికి ప్రమోషన్లు కల్పించడంలో సిఐటియు కృషి చేసింద ని తెలియజేశారు.అసంఘటిత రంగ కార్మికులైన ఆటో డ్రైవర్ల సమస్యపై,భవన నిర్మాణ కా ర్మికుల సమస్యలపై,హమాలీ కార్మికుల సమస్యలపై ఆందోళనలు కొనసాగించినట్లు చెప్పా రు.ఈ రకంగా అనేక ఉద్యమాలు కొనసాగించినప్పటికీ ఇంకా చాలా రంగాలలో సమ స్యల పట్ల పోరాటం చేయాల్సినంత కృషి చేయలేదని అన్నారు.భవిష్యత్తులో ఆయా రం గాలపై కేంద్రీకరించి పని చేయడం ద్వారా కార్మిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయ డానికి కృషి చేయాలని మహాసభ పిలుపు ఇచ్చినట్లు తెలిపారు.ఈ మహాసభ సందర్భంగా 12రకాల తీర్మానాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు.లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డిఏ లను విడుదల చేయాలని,ప్రభుత్వ రంగం లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని,కనీస వేతనాలు అమలు చే యాలని,కొత్తగా వస్తున్న పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,జి ల్లాలో పట్టణాలలో రోజురోజుకు పెరుగుతున్న షాపింగ్ మాల్స్,ప్రవేట్ నర్సింగ్ హోమ్స్, ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మిక చట్టాలను అమలు చేసి,కనీస వేతనా లు ఇవ్వాలని,స్కీం వర్కర్లకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని,రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 13గంటల పని విధానాన్ని ఉపసంహారించుకుని ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని,రాత్రివేళల్లో మహిళలను పని చేయించడాన్ని నిలుపుదల చేయాలని, పంచలింగాలలో రైల్వే వ్యాగన్ వర్క్ షాపు నిర్మాణాన్ని చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిం చాలని,మెప్మా రంగంలో పనిచేస్తున్న ఆర్పీలపై రాజకీయ వేధింపులు ఆపాలని,భవన ని ర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని,ఆటో కార్మికులలో అర్హు లైన వారికి అందరికీ ఆర్థిక సహాయం అందించాలని,రవాణా రంగంలో అత్యంత ప్రమాద కరమైన 2019మోటార్ వెహికల్ యాక్ట్ ను ఉపసంహరించుకోవాలని,స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న డ్రైవర్ల అందరికీ నష్టపరిహారం చెల్లించాలని,తదితర తీర్మానాలను మహాసభ ఆమోదించినట్లు తెలియజేశారు.రాబోవు కాలంలో ఈ తీర్మానాలు అమలు కో సం పోరాటాలు కొనసాగించాలని మహాసభ నిర్ణయించినట్లు వారు తెలియజేశారు.రా బోవు మూడు సంవత్సరాల కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగే పోరాటాలను నా యకత్వం వహించడానికి అవసరమైన నూతన నాయకత్వాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఎ న్నుకున్నట్లు తెలియజేశారు.అనంతరం జిల్లా నూతన కమిటీ ఎంపిక చేశారు.
సిఐటియు జిల్లా నూతన కమిటీ :
జిల్లా అధ్యక్షులు : పి.ఎస్.రాధాకృష్ణ,
జిల్లా ప్రధాన కార్యదర్శి: ఎం.డి. అంజిబాబు,
జిల్లా ఉపాధ్యక్షులు : డి.గౌస్ దేశాయ్,బి.రామాంజనేయులు,పి.నిర్మల,కె.పి నారాయణస్వామి,జె.దివాకర్, నాగేశ్వరరావు,
జిల్లా కోశాధికారి : ఎం.గోపాల్,
జిల్లా కార్యదర్శులు : ఎం.విజయ్,ఎస్.ఉమాదేవి,కె.ప్రభాకర్,ఆర్.నరసింహులు,
పి.తిప్ప న్న,కోటేశ్వరరావు,60 మంది జిల్లా కమిటీ సభ్యులు 78మంది జిల్లా కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు.
Comments
Post a Comment