ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటు...SFI...

ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటు
ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను 
ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించాలి

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
ప్రభుత్వ వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధుల ఆశలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తుం దని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ విమర్శించారు.బుధవారం కర్నూ లు నగరంలో సుందరయ్య భవన్ లో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకులు సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గ మని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తులో అందరూ కలిసికట్టు గా పోరాటం చేస్తామని చెప్పారు.ప్రభుత్వం గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అం దించాలన్న ఉద్దేశంతో ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు.కూ టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాశాల పనులను నిలిపివేసి పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ) పద్ధతిలో కొనసాగించడానికి క్యాబినెట్ తీర్మానం చేయడం అన్యాయం అ న్నారు.ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం అందే పరిస్థితి ఉండదని ప్రభుత్వమే వైద్య కళాశా లను నడపాలని డిమాండ్ చేశారు.పీపీపీ విదానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన సెల్ ఫైనాన్స్ పద్ధతిపై తాము అధికారంలోకి వస్తే వంద రో జుల్లో రద్దు చేస్తామని ప్రకటించారు.కానీ ఇచ్చిన హమీపైన ఎందుకు నోరు మెదపడం లేద ని వాపోయారు.అధికారంలోకి రాకముందు ఒక మాట వాచ్చాక వాటి ఊసెత్తకపోవడం కూటమి ప్రభుత్వపు వైఖరిగా ఉందన్నారు.వెంటనే కూటమి ప్రభుత్వం వైద్య విద్య ప్రయివే టీకరణ ఆలోచనలను వెనక్కి తీసుకోవాలని,ఎన్ఎంసికి రాసిన లేఖను వెనక్కి తీసుకో వాలని,సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రుద్దుచేస్తామని ఇచ్చిన హామీని అమలు పరచాలని కోరా రు.మెడికల్ కళాశాల భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి,ఉచిత వైద్య విద్యను అందించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పడతా మని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సాయిఉదయ్,ప్రధాన కార్యదర్శి రంగప్ప,ఉపాధ్యక్షులు శ్రీనివాసులు,అంజి,అబూబకర్,జిల్లా నాయకులు రాము, ఆర్యన్,కాజా,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...