బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం... రూ.29వేల కోట్ల ఆస్తులు గుర్తింపు...

బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం
రూ.29వేల కోట్ల ఆస్తులు గుర్తింపు
విదేశాల్లో రహస్య ఆస్తులు కూడబెట్టిన 24,678 మందిని గుర్తించిన ఐటీ శాఖ
వీరి ఆస్తుల విలువ రూ.29,208కోట్లుగా అంచనా
అంతర్జాతీయ ఒప్పందాలతో బడా బాబుల గుట్టురట్టు
డిసెంబర్ వరకు ఐటీ శాఖ డెడ్‌లైన్
తప్పితే 30 శాతం పన్ను...రూ.10లక్షల జరిమానా

VS9TV న్యూస్,హైదరాబాద్ :
విదేశాల్లో రహస్యంగా ఆస్తులు కూడబెట్టిన వారికి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఉచ్చు బిగి స్తోంది.స్విట్జర్లాండ్‌తో సహా పలుదేశాలతో కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందం (AE OI) ఆధారంగా విదేశాల్లో లెక్కచూపని ఆస్తులు కలిగిన 24,678 మందితో కూడిన జా బితాను ఐటీ శాఖ సిద్ధం చేసింది.వీరికి విదేశాల్లో సుమారు రూ.29,208కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ఆస్తులతో పాటు వీరు దాదాపు రూ.1,089.88కోట్ల విదేశీ ఆదాయాన్ని కూడా తమ ఐటీ రిటర్న్‌లలో చూపలేదని అధి కారులు గుర్తించారు.విదేశాల నుంచి అందిన సమాచారాన్ని,2024-25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ఫైల్ చేసిన రిటర్న్‌లతో పోల్చి చూడటం ద్వారా ఈ బడాబాబుల గు ట్టు రట్టయింది.ఈ జాబితాలో పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉన్నతోద్యోగులు కూ డా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లోగా సవరించిన ఐటీ రిట ర్న్‌లు దాఖలు చేయా లంటూ త్వరలోనే వీరందరికీ ఎస్ఎంఎ స్‌లు,ఈమెయిళ్ల ద్వారా ఐ టీ శాఖ హెచ్చ రికలు జారీ చేయనుంది.గడువులోగా స్పందించని వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.అటువంటి వారిపై 30శాతం పన్ను విధిం చడం తో పాటు చెల్లించాల్సిన పన్నుపై అదనంగా రూ.10లక్షల వరకు జరిమానా విధించే అవ కాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....