కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ఫ్రాడ్ రూ.300 కోట్లు...
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసినఫ్రాడ్ రూ.300 కోట్లు
రాజకీయ నాయకులు పార్టీలు ఊరకనే మారరు...ఆ మార్పు వెనుక చాలా సమీకరణా లు ఉంటాయి.ఒక నియోజకవర్గం నాయకుడు పార్టీ మారుతున్న సమయంలో చేసే ప్ర ధాన ప్రకటన హాస్యాస్పదంగా ఉంటుంది.నియోజకవర్గం ప్రజలు,కార్యకర్తల అభివృద్ధి కో సం పార్టీ మారాల్సి వస్తుంది అని చెపుతాడు.కాని అసలు బాగోతంను కాలం నిర్ణయం చేస్తుంది అనే సూత్రం పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిరూపించారు.వివరాలు ఇ లా ఉన్నాయి...ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మైనింగ్ స్కాంలో ఇరుక్కుని ఎక్కడ దొరికిపోతా నో అని కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు.ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పటాన్ చెరు ని యోజకవర్గంలో ఆయన సోదరుడితో కలిసి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారు.దాదాపుగా మూడు వందల కోట్ల విలువైన స్కాం చేశారు.దీనిపై ఈడీ దర్యాప్తు చేసింది.తాజాగా అధి కారిక ప్రకటన విడుదల చేసింది.బీఆర్ఎస్ హయాంలో...ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఆయన సోదరుడి కంపెనీ పేరు మీద ఓ మైనింగ్ లీజు తీసుకున్నారు.తర్వాత మరో కుటుంబ కంపె నీకి సబ్ లీజుకు ఇచ్చినట్లుగా చూపించారు.కానీ నిబంధనల ప్రకారం అలా ఇవ్వకూడదు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కాకుండా అసైన్డ్ ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు చేసి పెద్దఎ త్తున నిర్మాణాలకు అమ్ముకున్నారు.దీని వల్ల ప్రభుత్వానికి రాయల్టీ కింద రూ.39.08కోట్లు ఆదాయం నష్టం జరిగింది.ఈడీ దర్యాప్తులో ఈ అక్రమ మైనింగ్ నుంచి వచ్చిన ఆదాయం ను బినామీల పేర్లలో ఆస్తులుగా పెట్టుబడి పెట్టినట్లు తేలింది.గతంలో ఎమ్మెల్యే,ఆయన సో దరుడి ఇళ్లల్లో సోదాలు చేసినప్పుడు బినా మీ ఆస్తి పత్రాలు లభించాయి.రూ.78.93 కో ట్ల విలువైన 81 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు.ఈ సంస్థల పేర్లలో రూ.1.12 కో ట్ల స్థిర డిపాజిట్లను కూడా అటాచ్ చేశారు.మొత్తం రూ.80కోట్లకు పైగా ఆస్తులు జప్తు చే శారు.ఈ దర్యాప్తు జరుగు తున్న సమయంలోనే మహిపాల్ రెడ్డి 2024,జూలైలో బీఆర్ఎ స్‌ను వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అంటే అప్పటికే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది...నీవు ఏ పార్టీలోనైనా ఉండు...అధికార పార్టీ కండువా కప్పుకుంటే చా లు...మీ అవి నీతి మాసిపోతుంది...లేకుంటే మా ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది అనే భయందోళన కలిగించే విధంగా అధికార పార్టీల బెదిరింపులకు తాళలేక... ఇలాంటి జంపింగ్ జిలానిలు తమ స్వార్థం కోసం నియోజకవర్గం ప్రజలు,కా ర్యకర్తల ఆత్మభిమానంను తాకట్టు పెడతారు అని మహిపాల్ రెడ్డి రుజువు చేశాడు.
Comments
Post a Comment