లైంగిక సమస్యకు మందు అని నమ్మి రూ.48 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్...

లైంగిక సమస్యకు మందు అని నమ్మి రూ.48 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్
ఆయుర్వేద వైద్యం పేరుతో టెక్కీని మోసం చేసిన నకిలీ బాబా
'దేవరాజ్ బూటీ' పేరుతో లక్షల్లో దోచుకున్నవైనం
డబ్బు పోవడమే కాకుండా కిడ్నీ సమస్యలు
కొనితెచ్చుకున్న బాధితుడు

VS9TV న్యూస్,బెంగళూరు :
బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణంగా మోసపోయాడు.లైంగిక సమస్యను న యం చేస్తానని నమ్మించిన ఓ నకిలీ ఆయుర్వేద వైద్యుడి చేతిలో ఏకంగా రూ.48 లక్షలు పోగొట్టుకున్నాడు.డబ్బు పోవడమే కాకుండా,ఆ నకిలీ మందుల కారణంగా కిడ్నీ సంబం ధిత సమస్యలను కూడా కొనితెచ్చుకున్నాడు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధి తుడు జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.పోలీసుల కథనం ప్రకారం...202 3లో వివాహం తర్వాత బాధితుడికి లైంగిక ఆరోగ్య సమస్య తలెత్తింది.మొదట ఓ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది.ఈ క్రమంలో మే,3న కేఎల్‌ఈ లా కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన వేసిన ఓ 'ఆయుర్వేదిక్ దవాఖా నా' గుడా రం అతడి కంటపడింది.అందులో 'విజయ్ గురూజీ'గా పరిచయం చేసుకున్న వ్యక్తి,తన దగ్గరున్న అరుదైన మందులతో సమస్యను శాశ్వతంగా నయం చేస్తానని నమ్మబలికాడు. హరిద్వార్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 'దేవరాజ్ బూటీ' అనే మందు కొనాలని సూచిం చాడు.గ్రాముకు రూ.1.6లక్షలు ఉంటుందని,యశ్వంత్‌పూర్‌లోని ఓ ఆ యుర్వేద స్టోర్‌లో ఇది దొరుకుతుందని చెప్పాడు.మందు కొనేటప్పుడు ఒంటరిగా రావాలని,డబ్బులు కూడా నగదు రూపంలోనే చెల్లించాలని షరతులు పెట్టాడు.అతని మాటలు నమ్మిన టెక్కీ ఆ మం దును కొన్నాడు.ఆ తర్వాత 'భావనా బూటీ తైలం' పేరుతో మరో మందును గ్రాముకు రూ. 76,000 చొప్పున అంటగ ట్టాడు.చికిత్స మధ్యలో ఆపితే వికటిస్తుందని బెదిరించడం తో,బాధితుడు భార్య,తల్లిదండ్రుల నుంచి రూ.17లక్షలు,బ్యాంకు నుంచి రూ.20లక్షల లోన్ తీసుకుని మరీ డబ్బు చెల్లించాడు.ఇలా మొత్తం రూ.48 లక్షలు సమర్పించుకున్నా, అతని సమస్య ఏమాత్రం తగ్గకపోగా కొత్తగా కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి.ఈ ఘట నపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. "రూ.48 లక్షలు ఖర్చు చేశాడా? అత ను మోసపోవడానికి అర్హుడే"అంటూ ఓ ప్రముఖ కార్డియాలజిస్ట్ వ్యాఖ్యానించగా,చదు వుకున్న వారు కూడా ఇలాంటి మోసాల బారిన పడటంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...