ఘనంగా 76వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు...పాముల కుమార్,ఎం ఎస్ పిఎస్,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్ పిఎస్) కర్నూలు జిల్లా నాయకులు...
ఘనంగా 76వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలుపాముల కుమార్,ఎం ఎస్ పిఎస్,మాదిగరిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్ పిఎస్) కర్నూలు జిల్లా నాయకులు
కర్నూలు నగరం,కల్లూరు,32వ వార్డ్, ఇందిరమ్మ కట్ట వద్ద ఉన్న భారత రా జ్యాంగ దినో త్సవం వేడుకలు బుధవారం ఎంఎస్ పిఎస్,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్ పిఎస్) కర్నూలు జిల్లా నాయకులు పాముల కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్బంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు.అనంతరం ఆయన మాట్లాడారు.1949, నవంబర్, 26వ తేదీన రాజ్యాంగ నిర్మా త డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ అందించిన ధర్మగ్రంథాన్ని దేశం ఆమోదిం చినట్లు చెప్పారు.1891,ఏప్రిల్,14న అణచివేతలో జన్మించిన మహానీయు డు.'విద్యే ఏకైక ఆ యుధం'అని నిరూపించి,ప్రపంచ మేధావుల సరసన నిలిచారని అన్నారు.ఆయన జీవితం కేవలం రాజ్యాంగ రచనకు మాత్రమే పరిమితం కాలేదు.మహద్ సత్యాగ్రహం (1927) ద్వారా ప్రజా తాగునీటి హక్కు కోసం,'బహిష్కృత భారత్' పత్రిక ద్వారా చైతన్యం కోసం చేసిన పోరాటాలు అలుపెరుగని యోధుడి ఆత్మగౌరవానికి సాక్ష్యాలు."చరిత్రను సృష్టిం చండి,కానీ చరిత్రను మరచిపోకండి"అనే ఆయన నినాదం నేటికీ మన గుండెల్లో స్ఫూర్తి దాయకం అని కొనియాడారు.అంబేద్కర్ అసలైన శక్తి,ఆయన రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరచని ఆర్థిక దార్శనిక తలో ఉంది.ఆర్థిక,నీటిపారుదల, విద్యుత్ మంత్రిగా (1942-1946) ఆయన చేసిన అద్భుతమైన కృషిని చరిత్ర సరిగా గుర్తిం చలేదు.భారత దేశ ఆర్థిక వ్యవస్థకు,వి ద్యుత్ ఉత్పత్తికి ఆయన చేసిన దిశానిర్దేశం అమోఘం.దామోదర్ వ్యాలీ,హీరా కుడ్ డ్యామ్,సోన్ నది ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించి,భార తదేశంలో "జాతీయ జల విధానం ఆవశ్యకతను తొలిసారిగా గుర్తించారు."కేంద్రీకృత వి ద్యుత్ గ్రిడ్"వ్యవస్థను ప్రతిపాదించి,నేటి మౌలిక వసతులకు ఆనాడే పునాది వేశారు.
ఈ నదీ లోయల రూపశిల్పి ఆలోచనలే నేటి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచా యి.అంబేద్కర్ ఆర్థిక మేధన్సు రాజ్యాంగంలో కంటే,దేశ ఆర్థిక పాలసీలలో ఎంతగా ది శానిర్దేశం చేసిందో చెప్పడానికి,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనే నిదర్శ నం.19 23లోనే ఆయన రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రుపీ,ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూ ష న్ అనే సిద్ధాంత గ్రంథం బ్యాంక్ స్థాపనకు మూలం,హిల్టన్ యంగ్ కమిషన్ ఆయన ఆ లోచనలను అధ్యయనం చేసి,దాని ఆధారంగానే 1935 రిజర్వ్ బ్యాంక్ స్థాపించబడిం దన్నారు.ద్రవ్యోల్బణ నియంత్రణ,రూపాయి విలువ స్థిరత్వం,కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ ఆవ శ్యకతపై వారు చూపిన అసామాన్య దార్శనికత దేశ ఆర్థిక వ్యవస్థకు చారిత్రక వెన్నుద న్నుగా పనిచేసిందన్నారు.శ్రామిక వర్గానికి భరోసా కొరకు ఎనిమిది గంటల పనిదినం వె నుక పోరాటం అంబేద్కర్ కేవలం అణగారిన వర్గాల నేతగా మాత్రమే కాదు.సమస్త శ్రా మిక వర్గానికి అండగా నిలిచిన పోరాట యోధుడు.కార్మిక శాఖా మంత్రిగా పనిచేసిన కాలంలో (1942- 1946),ఆయన కార్మికులకు రోజుకు ఎనిమిది గంటల పని దినం (గంటల చట్టం,1942),సమాన పనికి సమాన వేతనం,ట్రేడ్ యూనియన్లకు చట్టబద్ధ గుర్తింపు,సెలపు హక్కు,అత్యంత ముఖ్యమైన ప్రావిడెంట్ ఫండ్ వంటి చారిత్రక హక్కు లను సాధించారు.ఎని మిది గంటల పనిదినం అనేది అంత ర్జాతీయ కార్మిక పోరాటాల ఫలితమే అయినప్పటికీ,దానిని భారతదేశంలో పటిష్టంగా అమలు చేసి,కార్మిక సంక్షే మానికి నిర్దిష్ట దిశానిర్దేశం చేసిన అంబే డ్కర్ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.1956, డి శంబర్, 6న ఆయన తుది శ్వాస విడిచే కొద్ది రోజుల ముందు చెప్పిన చివరి మాటలు నే టికీ దేశాన్ని కుదిపేస్తున్నాయి.రాజ్యాంగం అందించిన రాజకీయ ప్రజాస్వామ్యం కేవలం ఒక సాధనం మాత్రమేనని,సామాజిక ప్రజాస్వామ్యం అంటే సమానత్వం,స్వేచ్ఛ,సౌభ్రా తృత్వం అనే మూడు సూత్రాలను ప్రజల జీవితంలో నిజం చేయాలని ఆయన హెచ్చరిం చారు.ఈ మూడు సూత్రాలు విడివిడిగా ఉంటే,ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన స్పష్టం చేశారు.నేటి భారతదేశంలో సామాజిక సమానత్వం పూర్తి స్థాయిలో సా ధించబడకపోవడం,కులతత్వం,వివక్ష కొనసాగుతుండటం...ఆయన దార్శనికతకు ఎదు రవుతున్న తీవ్రమైన అగ్నిపరీక్ష అని ఆవేదన చెందారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భం గా,కేవలం రాజ్యాంగ పుస్తకాన్ని పూజించడం కాదు.దాని వెనుక ఉన్న ఆ విప్లవ స్ఫూర్తి ని స్మరించుకోవాలి.అంబేద్కర్ అందించిన విద్య,ఐక్యత,పోరాటం అనే సందేశాన్ని మన జీవితాల్లో భాగం చేసుకోవాలి.ఆయన పటిష్టంగా ఉండాలని కోరుకున్న రాజ్యాంగ సం స్థలు,సామాజిక న్యాయసూత్రాలు పాలకుల రాజకీయ ప్రయో జనాల కోసం దెబ్బ తిం టున్న నేటి పరిస్థితుల్లో,రాజ్యాంగంలో లేని ఆయన ఆర్థిక, సాంకేతిక,సామాజిక దార్శని కతను అధ్యయనం చేయాలి.కుల,మత వివక్షలేని ఆర్థిక సమానత్వం కలిగిన న్యాయబ ద్ధ సమాజాన్ని స్థాపించడానికి కృషి చేయడమే మనం అలుపెరుగని యోధుడికి అందిం చే నిజమైన నివాళి అని పాముల కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో 32వ వార్డ్ గౌర వాద్యాక్షులు ఎం.వెంకటేశ్వర్లు,బి.లింగన్న,దుర్గ,శ్రీనివాసులు,నారాయణ,మీసాలశివ,మై తాపు దేవదాస్,మైతాపు కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment