మహిళా మార్ట్ కు చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించాలి...అవినీతిపైన విచారణ జరిపించాలి...పి.ఎస్.రాధాకృష్ణ,సిఐటియు జిల్లా అధ్యక్షులు...
మహిళా మార్ట్ కు చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించాలిఅవినీతిపైన విచారణ జరిపించాలిపి.ఎస్.రాధాకృష్ణ,సిఐటియు జిల్లా అధ్యక్షులు
పొదుపు మహిళల నుండి రూ.66 లక్షలు వసూలు చేసి,జగనన్న మహిళా మార్ట్ ఏర్పా టు చేసి మూతకు కారణమైన వారిపై,మెప్పా ఎల్.హెచ్.జిలాని అప్పటి పీడీ నాగ శివలీల అక్రమాలపై వెంటనే విచారించి పొదుపు మహిళల సొమ్మును చెల్లించాలి.లేనిపక్షంలో మహిళల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుంది అని హెచ్చరించారు.ఈ మే రకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం క ర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఎస్.ఉమాదేవి అధ్యక్షతన ఆర్ పిలు,మ హిళలతో కలిసి ధర్నా చేపట్టారు.కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షు లు పి.ఎస్.రా ధాకృష్ణ,శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి.నిర్మల హాజరయ్యారు.ఈ సందర్బంగా పి.ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ మహిళా మార్ట్ ఏర్పాటు చేసినప్పుడు సభ్యుల ప్రమేయం లేకుండా ఆర్పిలపై ఒత్తిడి తెచ్చి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి,నిర్వహణ పద్ధ తులను విస్మరించి,మహిళల సొమ్మును కొల్లగొట్టిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవా లన్నారు.ఆర్పిలకు గ్రేడింగ్ విధానం రద్దుచేసి,కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని,అలా ఇవ్వకపోగా నెలకు అతి తక్కువ వేతనం రూ.90,రూ.800, రూ.1000,రూ.2000, రూ.4000,రూ.5000 వేతనం వేయటం చాలా సిగ్గుచేటు అన్నారు.ఇప్పటికైనా సరిచే సి ఏదైతే గతంలో ప్రకటించిన రూ.8000 వేయాలని,బకాయిపడ్డ నాలుగు నెలల వేత నాలు చెల్లించాలని,మీ సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు మీరు పోరాటం నిర్వహిం చాలని,మీ పోరాటానికి సిఐటియు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ,మీ ఉ ద్యమాల వెంట ఉంటుందని పేర్కొన్నారు.జిల్లా కోశాధికారి సుజాత ప్రసాద్ మాట్లాడుతూ పొదుపు గ్రూపులకు మెప్మా సంస్థకు సమన్వయం కోసం ఫ్రమ్ లెవెల్ ఫెడరేషన్ ఆర్పిలను ఎంపిక చేసుకుంటే,పొదుపు గ్రూపుల నిర్వహణ పక్కకు పెట్టి యాప్ ల పేరుతో ఆన్లైన్ వ్యాపారం,డిజిటల్ లిటరేచర్,యోజన విద్య పేరుతో గంటల తరబడి వెట్టి చాకిరి చేయి స్తున్నారు.యాప్ లా గురించి కూడా చాలా మందికి తెలియదు.వాటి మీద పరిజ్ఞానం క ల్పించకుండా చేయండి అంటూ సిఓలు ఆర్పీలపై టార్గెట్ పేరుతో వేధింపులకు గురిచేస్తు న్నారన్నారని అన్నారు.సిఐటియు నాయకులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరు నెలల కు ఒకసారి వేసే వేతనం కూడా,తక్కువ వేయడంతో తలకు మించిన భారంలా మెప్మా అ ధికారులు చేయిస్తున్నారని చెప్పారు.ఆర్ పిల పోరాటాన్ని ఉదృతం చేయవలసిన అవ సరం ఉందని అన్నారు.కొంత మంది సిఓలు ఆఫీసులో ఫ్యాన్ కింద కూర్చొని,నిరసన చే స్తున్న ఆర్పిలను సమ్మె చేస్తున్నారని చెప్పటం,ఒక సిఓ కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలనా అన డం శోచనీయమన్నారు.ఆ సిఓ కుర్చీలో కూర్చొని పనిచేస్తున్నారని,నెలకు రూ.30 వేలు తీ సుకుని ఫ్యాన్ కింద కూర్చొని పని చేస్తుంటే,పొదుపు గ్రూపు మహిళల ఇంటింటి దగ్గరికి వెళ్లి కిచెన్,గార్డెన్,టెర్రస్,ఆన్లైన్ వ్యాపారం ప్రజ్ఞ యాప్,ప్రధాని పర్యటనలకు అన్నం తిన కుండా కూడా రాత్రి పగలు పనిచేసిన ఆర్పిలకు ఎంత వేతనం ఉండాలో చెప్పాలని ప్ర శ్నించారు. ప్రధాని సభలో పత్త లేని మీరు మాట్లాడటం గురివింద గింజ తన నలుపు ఎ రగదు అన్నట్లు ఉందని ఆయన మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో ఏపీ మెప్మా ఆర్ పిల సం ఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.రుద్రమ్మ,ఎస్.ఉమాదేవి,జిల్లా నాయకులు కన్యక,మ హాలక్ష్మి,మంజుల,నగర నాయకులు బి.జ్యోతి,పర్వీన్,ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, నగర అధ్యక్షురాలు కుమారి పొదుపు మహిళలు ఆర్పీలు నాగమణి,ఉష,వీణ,రేవతి,గా యత్రీ,ధరణి,రామేశ్వరీ,అరుణ,మాధవి,లక్ష్మీ,మహేశ్వరమ్మ,అమృత,ఉమ,రుద్రమ్మ,కన్యక, రాజేశ్వరి,పర్వీన్,కుమారి,బి.జ్యోతి,ఆర్పీలు నాగమణి,ఉష,వీణ,రేవతి,గాయత్రీ ధరణి,రా మేశ్వరీ,అరుణ,మాధవి,లక్ష్మీ,మహేశ్వర్మ,అమృత,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment